నటి ఆరోప‌ణ‌.. ఏసీపీకి ఫేవ‌ర్ కావాలట‌!

Update: 2018-07-29 04:31 GMT
పెళ్లి పేరుతో మ్యాట్రిమోనియ‌ల్‌ లో ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం - అటుపై ప‌రిచ‌యం అయిన కొత్త కుర్రాళ్ల‌కు చుక్క‌లు చూపించ‌డం ఈ యంగ్ యాక్ట్రెస్ వ్యాప‌కం. ఈ అప్‌ కం న‌టి పేరు శ్రుతి. ఇదివ‌ర‌కూ ఓ ఎన్నారైని - కొంద‌రు యువ‌కుల్ని ఈ త‌ర‌హాలో పెళ్లి పేరుతో ల‌క్ష‌ల్లో మోసం చేసిన ఈ యువ‌తిని చెన్న‌య్ పోలీసులు అరెస్టు చేసి జైల్లో వేశారు. అయితే శ్రుతి అరెస్టు అనంత‌రం బెయిల్‌ పై బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ వెంట‌నే మీడియా మీట్ పెట్టి  అసిస్టెంట్ పోలీస్ క‌మీష‌న‌ర్‌ పై (ఏసీపీ)పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేసింది.

సెల్‌లో ఉన్న‌ప్పుడు త‌న బ‌ట్ట‌లు చించి - తాక‌రాని చోట తాకాడ‌ని - ఆ మొత్తం ఉదంతాన్ని ఓ లేడీ పోలీస్ వీడియో చిత్రీక‌రించి బెదిరించింద‌ని - ఒక‌వేళ బ‌య‌ట‌కు చెబితే సెల్లోనే రేప్ చేసి - రోడ్డుపైకి విసిరేస్తాన‌ని స‌ద‌రు ఏసీపీ బెదిరించాడ‌ని తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేసింది. బ‌ట్ట‌ల్లేకుండా త‌న‌ని వీడియో షూట్ చేసి దానిని ఇంట‌ర్నెట్ లో పెడ‌తామ‌ని బెదిరించార‌ని - ఏసీపీ త‌న‌కు సెక్సువ‌ల్ ఫేవ‌ర్ చేయాల్సిందిగా బ‌ల‌వంతం చేశాడ‌ని ఆరోపించింది. మొత్తానికి ఈ గొడ‌వ పెద్ద రేంజుకే వెళ్లేట్టే క‌నిపిస్తోంది. ఆది పోనా ఆవ‌ని - చోళ వంశం చిత్రాల్లో శ్రుతి న‌టించింది.
Tags:    

Similar News