నేడు తెల్లవారుతుండగానే తమిళనటి వీజే చిత్ర ఆత్మహత్య వార్తలతో తమిళ బుల్లి తెర అభిమానులు షాక్ అయ్యారు. బుల్లి తెర వెండి తెర అనే తేడా లేకుండా చిత్ర చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈమెకు హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ దక్కింది. అలాంటి వీజే చిత్ర ఆత్మహత్య విషయం అందరికి ఆవేదన మిగిల్చింది. కొన్ని గంటల వరకు షూటింగ్ లో పాల్గొన్న చిత్ర.. ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో ఆనందంగా ఉన్నాను అంటూ పోస్ట్ పెట్టిన ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అంటూ అంతా కూడా తలలు బద్దలు కొట్టుకునేలా ఆలోచిస్తున్నారు. అయినా కూడా సమాధానం లభించడం లేదు.
ఈ సమయంలో ఆమె తండ్రి పోలీసులకు తన కూతురు మృతి విషయమై అనుమానాలు ఉన్నట్లుగా ఫిర్యాదు ఇచ్చాడు. పోలీసులు ఆమె బాడీపై కొన్ని గాయాలు గుర్తించినట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మెడపై మరియు బుగ్గలపై చిన్న గాయాలు ఉండటంతో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రోజులుగా తల్లిదండ్రులతో మరియు కాబోయే భర్తతో చిత్ర సరిగా ఉండటం లేదు అనేది కొందరి వాదన. కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని తాము భావించడం లేదని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఇంటి నుండి వెళ్లి వచ్చిన తర్వాత వీజే చిత్ర ఎవరిని కలిసింది.. ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. చిత్ర ది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా ఎంక్వౌరీ చేస్తున్నారు.