మారుతున్న ‘బిగ్ బాస్’ హోస్ట్‌.. వ‌చ్చేది ఎవ‌రంటే..?

Update: 2021-03-23 06:30 GMT
బిగ్ బాస్ షోకు ఎంత పాపులారిటీ ఉందో అంద‌రికీ తెలిసిందే. దేశంలోని అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ స‌క్సెస్ అయిన షోను.. త‌మిళ‌నాట క‌మ‌ల్ హాస‌న్ స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ కంప్లీట్ అయిన నాలుగు సీజ‌న్ల‌కూ ఆయ‌నే హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించారు. అయితే.. ఐదో సీజ‌న్ నుంచి క‌మ‌ల్‌ తప్పుకోబోతున్న‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి.

క‌మ‌ల్ హాస‌న్‌ ఇప్పుడు కేవ‌లం సినిమా స్టార్ మాత్ర‌మే కాదు.. సీరియ‌స్ పొలిటీషియ‌న్ కూడా. కాబ‌ట్టి.. పార్టీ కార్య‌క్ర‌మాల‌తో నిత్యం బిజీగా ఉండాల్సి వ‌స్తుంది. తీరిక లేని వ్య‌వ‌హారాల్లో త‌ల‌మున‌క‌లైపోతారు. మ‌రోవైపు.. ఇండియ‌న్-2 సినిమా కూడా బాకీ ఉంది. ఇవి చేస్తూ.. బిగ్ బాస్ షోను ర‌న్ చేయ‌డం సాధ్యం కాద‌ని భావిస్తున్నార‌ట క‌మ‌ల్‌. అందుకే.. వ‌చ్చే సీజ‌న్ నుంచి త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.

వాస్త‌వానికి నాలుగో సీజ‌న్ నుంచే వైదొల‌గాల‌ని అనుకున్నార‌ట. అయితే.. కొత్త‌గా రాజ‌కీయ పార్టీ పెట్టిన నేప‌థ్యంలో.. పార్టీ నిర్వ‌హ‌ణ‌కు నిధులు చాలా అవ‌స‌రం అవుతాయి. ఈ అవ‌స‌రానికి బిగ్ బాస్ రెమ్యున‌రేష‌న్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న‌ ఉద్దేశంతోనే హోస్ట్ గా కంటిన్యూ అయ్యార‌ట‌. కానీ.. త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఆ త‌ర్వాత.. పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంటుంది? ఎన్నీ సీట్లు సాధిస్తుంది? భ‌విష్య‌త్ నిర్మాణం ఏంటీ? అన్న‌ది ఇప్పుడే తెలియ‌దు. అయితే.. ఎన్నిక‌ల ఫ‌లితం ఎలా ఉన్నా.. పార్టీని ముందుకు న‌డిపించేందుకే సిద్ధంగా ఉన్నార‌ట క‌మ‌ల్. దీంతో.. అనివార్యంగా బిగ్ బాస్ కు గుడ్‌ బై చెప్ప‌బోతున్నార‌ట‌.

అయితే.. క‌మ‌ల్ స్థానంలో హీరో శింబు బిగ్ బాస్ హోస్ట్ గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ.. క‌మ‌ల్ స్థాయిలో ఎంట‌ర్ టైన్ చేయ‌గ‌ల‌డా? అనే సందేహం వ్య‌క్తం చేస్తున్నారు చాలా మంది. శింబుకు మంచి మాట‌కారిగా గుర్తింపేమీ లేద‌ని అంటున్నారు. మ‌రి, క‌మ‌ల్ మాదిరిగా షోను హుందాగా న‌డిపించ‌గ‌ల‌డా? అని డౌట్ ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు. ఫైన‌ల్ గా ఏం జ‌రుగుతుంది? అస‌లు క‌మ‌ల్ వెళ్తారా? త‌ర్వాత ఎవ‌రు వ‌స్తారు? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News