ప్రస్తుతం సినీ రంగంలో అవార్డులకు కొదువ లేదు. పలు బడా మేగజైన్స్ నుంచి.. న్యూస్ ఛానల్స్ వరకూ చాలా రకాల అవార్డ్ ప్రదానోత్సవాలు జరుగుతున్నాయి. అయితే.. ఎన్ని రకాల పురస్కారాలు ఉన్నా.. ప్రభుత్వం తరఫున అందుకుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అందుకే జాతీయ అవార్డులను అంత ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఈ కోవలోకే తెలుగు సినిమాలకు ఇచ్చే నంది అవార్డులు కూడా చెందుతాయి. ఈ మాదిరిగానే తమిళంలో తమిళనాడు స్టేట్ అవార్డ్స్ ఇస్తారు. గత కొన్నేళ్లుగా ఈ పురస్కారాల పండుగ జరగడం లేదు. ఇప్పుడు 2009 నుంచి మొదలుపెట్టి.. 2014 వరకూ ఒకేసారి హోల్ సేల్ గా అవార్డులను ప్రకటించేసింది తమిళనాడు ప్రభుత్వం.
దీంతో చాలామందికి అవార్డులు వచ్చేశాయ్ కానీ.. వీరిలో కొందరు హాట్ హీరోయిన్స్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఆ సినిమాలు చేసే సమయానికి వాళ్ళు మామూలు హీరోయిన్లే కాని.. ఇప్పుడు మాత్రం సూపర్ స్టార్లు. ఇంతకీ అవార్డులు గెలుచుకుంది ఎవరంటే.. 2011కు గాను.. అమలాపాల్ కు 'మైనా' చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డ్ ఇచ్చారు. తాను ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం అయిన మైనాకు తమిళనాడు స్టేట్ అవార్డు రావడంపై అమల స్పందించింది. ఆమె ప్రేమ ఇంకా పెరుగుతోందని చెప్పింది. ఇక ఈ ఏడాది తెలుగు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు అన్నిటినీ క్లీన్ స్వీప్ చేసేస్తున్న సమంతకు.. 2012 సంవత్సరానికి గాను 'నీతానే ఎన్ పోవసంతం' చిత్రానికి ఉత్తమ నటి అవార్డ్ దక్కింది. తెలుగులో ఎటో వెళ్లిపోయింది మనసు పేరుతో రూపొందిన మూవీ ఇదే. తెలుగులో ఎటో వెళ్లిపోయింది మనసు పేరుతో రూపొందిన మూవీ ఇదే. 2013 సంవత్సరానికి గాను రాజా రాణి చిత్రానికి నయనతార బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును గెలుచుకోవడం విశేషం.