తమిళ సూపర్ స్టార్ అజిత్ ఈమద్య కాలంలో హైదరాబాద్ లో తన తాజా చిత్రం 'వాలిమై' షూటింగ్ చేస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో వాలిమై షూటింగ్ ను నిర్వహిస్తుండగా ఆయనకు రోడ్ సైడ్ ఫుడ్ బాగా ఇష్టం అయ్యిందట. ప్రతి రోజు రోడ్డు సైడ్ ఒక ఇడ్లీ బండి వద్ద టిఫిన్ చేసేవాడట. ఆ సమయంలో ఇడ్లీ బండి వ్యక్తి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు. పిల్లల చదువుకు ఇబ్బంది అవుతుందని ఇడ్లీ బండి వ్యక్తి చెప్పడంతో వారి చదువుకు కావాల్సిన సాయంను చేస్తానంటూ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఇడ్లీ బండి వ్యక్తి పిల్లల చదువు కోసం లక్ష రూపాయలను అజిత్ సాయంగా అందించాడని తెలుస్తోంది. అజిత్ మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల్లో సూపర్ స్టార్ అలాగే నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ అంటూ పేరు తెచ్చుకున్నాడు. మరోసారి ఆయన తన మంచి మనసును చాటుకున్నాడు. అజిత్ వాలిమై సినిమా విషయానికి వస్తే సినిమాను ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.