చనిపోయాక మన శరీరం మట్టిలో కలిసిపోతే ఏం వస్తుంది? అదే మన శరీర భాగాలు పరిశోధనల కోసమో లేదా.. తమ శరీర భాగాలు కోల్పోయిన అభాగ్యులకో ఉపయోగపడితే మంచిదే కదా. అందుకే అవయవ దానం అన్నది చాలా మంచి విషయం. కానీ దీనిపై జనాల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల చనిపోయిన వారి శరీరాలు ఊరికే మట్టిలో కలిసిపోతున్నాయి. ఐతే కొందరు సెలబ్రెటీలు అవయవ దానానికి ముందుకొస్తూ జనాల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. లోననాయకుడు కమల్ హాసన్ ఈ మధ్యే తన మరణాంతరం తన శరీరంలోని అన్ని భాగాల్ని పరిశోధనల కోసం ఉపయోగించుకోవడానికి అంగీకరిస్తూ ఓ సంస్థతో అంగీకారం కుదుర్చుకోవడం తెలిసిన సంగతే.
కమల్ స్ఫూర్తితో తమిళ సినీ దర్శకుల సంఘం అరుదైన నిర్ణయం తీసుకుంది. పరిశోధనల కోసం తమ మరణానంతరం శరీరాలను దానం చేయాలని 62 మంది దర్శకులు - మరో ఇద్దరు వారి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలసి అంగీకార పత్రాలను కూడా అందజేశారు. దర్శకుల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని జయలలిత అభినందించారు. పరిశోధనల కోసం శరీరాన్ని దానం చేయాలని దర్శకుల సంఘం వార్షిక సర్వసభ్య సమావేశంలో తాను వెల్లడించగా, అందరూ సానుకూలంగా స్పందించారని సంఘం అధ్యక్షుడు విక్రమన్ చెప్పారు. కమల్ హాసన్ ను స్ఫూర్తిగా తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.