చెత్తగా ఉన్నా ఇంత పెద్ద సక్సెస్‌ ఎలా అయ్యిందో?

Update: 2019-12-17 09:56 GMT
ఏడు సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను జబర్దస్త్‌ షో ఏ స్థాయిలో ఎంటర్‌ టైన్‌ చేస్తుందో షో రేటింగ్‌ ను చూస్తే అర్థం అవుతుంది. తెలుగు బుల్లి తెరపై సెన్షేషన్‌ క్రియేట్‌ చేసిన జబర్దస్త్‌ ఎప్పుడు ఏదో ఒక వార్తతో వార్తల్లో ఉంటూనే ఉంది. ఇప్పుడు నాగబాబు జబర్దస్త్‌ నుండి తప్పుకోవడంతో ఈసారి మరింత పతాక స్థాయిలో జబర్దస్త్‌ వార్తల్లో నిలిచింది. కామెడీ షో నుండి నాగబాబు వెళ్లి పోయి జీ తెలుగులో అదిరింది అనే షో చేసేందుకు సిద్దం అయ్యాడు. జబర్దస్త్‌ షో గురించి ఈమద్య కాలంలో మీడియాలో వస్తున్న వార్తల గురించి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు.

తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నేను ఒక్క ఎపిసోడ్‌ కూడా జబర్దస్త్‌ కార్యక్రమం చూడలేదు. కాని ఒకసారి మల్లెమాల శ్యాంప్రసాద్‌ రెడ్డి గారు 50 స్కిట్స్‌ తో ఒక డీవీడీని ఇచ్చారు. వాటిలో కొన్ని చూశాను. ఒక్కటి కూడా నచ్చలేదు. ఆ డీవీడీని ఇస్తూ ఇందులో ఒక్క కామెడీ కూడా బాగాలేదు. ఇంత చెత్తగా కామెడీ ఉన్నా కూడా ఎలా ఇంత పెద్ద సక్సెస్‌ అవుతుందో నాకు అర్థం కావడం లేదు అన్నాను. జబర్దస్త్‌ కు జనాలు ఎందుకు ఇంతగా అలవాటు పడ్డారో నాకైతే అర్థం కాలేదు అన్నాడు.

నాగబాబు తప్పుకోవడంతో జబర్దస్త్‌ ఉంటుందా పోతుందా అనే చర్చ జరుగుతుంది. నేను చూసిన కామెడీ స్కిట్స్‌ తో నాకు పెద్దగా ఆసక్తి అనిపించలేదు. అలాంటి షో ఉంటే ఎంత పోతే ఎంత. దానికి గురించి చర్చ ఎందుకు అన్నాడు. ఇక నాగబాబు తప్పుకోవడంపై స్పందిస్తూ ఎవరి ఇష్టం వాళ్లది. చూడాలనుకుంటే చూడవచ్చు.. ఆయనకు నచ్చితే చేయవచ్చు. నచ్చలేదు కనుక తప్పుకున్నాడు. దీన్ని ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం ఏంటీ అంటూ ఈ సందర్బంగా తమ్మారెడ్డి కామెంట్స్‌ చేశాడు.

Tags:    

Similar News