దాదాపు రెండు నెలల తరువాత టాలీవుడ్ కు ఆగస్టు న విడుదలైన 'బింబిసార', 'సీతారామం' బ్లాక్ బస్టర్ లుగా నిలిచి సరికొత్త ఉత్సాహాన్ని ధైర్యాన్ని అందించాయి. ఈ రెండు సినిమాలపై తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. బింబిసార, సీతా రామం చిత్రాలు హిట్ అయ్యాయి కదా అని సంబరపడిపోకూడదని చురకలంటించారు. భవిష్యత్తులో తెరకెక్కించే ప్రతి సినిమాని కూడా మంచి కంటెంట్ తో రూపొందించాలన్నారు.
మూడు, నాలుగు రోజుల వసూళ్లని చూసి సంబరాలు చేసుకోకూడదని ఈ పందర్భంగా మేకర్స్ కు సూజనలు చేశారు. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన పీరియాడిక్ ట్రైమ్ ట్రావెల్ ఫిక్షన్ 'బింబిసార'. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె. హరికృష్ణ నిర్మించిన ఈ మూవీ ద్వారా మల్లిడి వశిష్ట దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆగస్టు 5న విడుదలైన ఈ మూవీ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. గురువారం ఈ మూవీని వీక్షించిన తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'బింబిసార' రెగ్యులర్ కమర్షియల్ కథేనని, కొత్త కథేమీ కాదన్నారు. అయితే దర్శకుడు ఈ కథని అర్థవంతంగా తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుందని ప్రశంసలు కురిపించారు. 'బింబిసార' అనే క్రూరుడైన రాజు తో కథని ప్రారంభించి టైమ్ ట్రావెల్ లో ఆ రాజు ఎంత ఎమోషనల్ మారిపోయాడో చక్కగా ఆవిష్కరించారన్నారు.
టైమ్ ట్రావెల్ కథ కాబట్టి దీన్ని 'ఆదిత్య 369'తో పోల్చడం సరికాదన్నారు. ' 'బింబిసార'కు 'ఆదిత్య 369'కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
మంచి కంటెంట్ వుంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాలని ఆదరిస్తారు. అయితే ఈ విజయాలతో సంబరపడిపోకుండా సినిమా రన్ పెరిగేలా పై దృష్టిపెడితే బాగుంటుందని, థియేటర్లకు రెగ్యులర్ గా వచ్చే ప్రేక్షకులు పెరగాలని సలహా ఇచ్చారు. 50 రోజుల పాటు సినిమాలు థియేటర్లలో ఎందుకు ఆడటం లేదు.. ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావడం లేదో దానిపై దృష్టి పెట్టాలన్నారు.
అలా ఆలోచించినప్పుడే మరిన్ని మంచి సినిమాలు వస్తాయని, తద్వారా థియేటర్లు బ్రతుకుతాయని, సినిమాకు పూర్వ వైభవం వస్తుదని స్పష్టం చేశారు. మేజర్, విక్రమ్ సినిమాల తరువాత థియేటర్లలో సక్సెస్ అనే మాట విని దాదాపు రెండు నెలలు కావస్తోంది. డబ్బింగ్ సినిమా 'విక్రమ్' ని పక్కన పెడితే తెలుగు నుంచి హిట్టయిన మూవీ 'మేజర్' ఒక్కటే. మళ్లీ రెండు నెలల తరువాత టాలీవుడ్ కు ఒకే సారి 'బింబిసార', సీతారామం' వంటి రెండు విజయాలు దక్కడంతో ఇండస్ట్రీలో పండగ వాతావరణం మొదలైంది.