భరణి వారి ఫీడ్ బ్యాక్ 'వారి'కేనా?

Update: 2017-06-18 09:49 GMT
తెలుగు సినీ పరిశ్రమలో తనికెళ్ల భరణి స్థానం ప్రత్యేకమైనది. ఇటు నటుడిగా.. రచయితగా మాత్రమే కాకుండా.. మంచి పరిశీలకుడిగా కూడా ఆయన్ను చెబుతారు. సునిశితమైన ఆయన దృష్టి.. దాని ద్వారా కనిపించే లోపాలను బైటకు చెప్పడంలో సందేహించరు. అయితే.. కొందరి విషయంలో.. కొన్ని సినిమాల విషయంలో ఆయన ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకుంటారట.

ఇటు సినిమాలతో పాటు.. వ్యక్తిగత ఇష్టం- అందిన ఆహ్వానాల మేరకు తరచుగా పర్యటిస్తుంటారు తనికెళ్ల భరణి. అలాంటి సమయంలో తను గమనించిన వాటిని ఆయా సినిమాల దర్శకులకు చేరవేస్తుంటారు. అమీతుమీ చిత్రానికి గాను.. పోస్టర్ల రూపంలో లభించాల్సిన ప్రచారం తగిన విధంగా లేదని.. వాటిని విస్తృత పరచాలని దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణకు సలహా ఇచ్చారట తనికెళ్ల భరణి. కొన్ని రోజులకే ఇదే తరహా సలహా సూచనలు.. హరీష్ శంకర్ కు కూడా అందాయి. తనికెళ్లపై ఉన్న అపార గౌరవం.. నమ్మకం కారణంగా.. ఈ రెండు సినిమాల నిర్మాతలు వెంటనే పోస్టర్ ప్రచారాన్ని బాగా ఎక్కువగా చేశారట.

ఇంద్రగంటి మోహన్ కృష్ణ.. హరీష్ శంకర్ లకు.. తనికెళ్ల భరణి ప్రత్యేకించి సలహాలు ఎందుకు ఇచ్చారో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదులే అని కొందరు చెప్పుకుంటున్నారు. అయితే.. తనికెళ్ల భరణికి అలాంటి భావాలు ఉండవని.. ఈ రెండు సినిమాలు వరుసగా విడుదల అవడంతోనే ఇలాంటి భావన కలిగిందని కొందరు చెబుతున్నారు. సలహాను సలహాగా మాత్రమే తీసుకోగలిగిన ప్రతీ ఒక్కరికీ తనికెళ్ల సూచనలు చేస్తుంటారని ఇండస్ట్రీ ఇన్నర్ టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News