ఆ హీరోయిన్‌ ను చంపేందుకు ప్రయత్నిస్తున్న వారు ఎవరు?

Update: 2022-09-24 01:30 GMT
బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో కూడా హీరోయిన్ గా మెప్పించిన తనుశ్రీ దత్తా ఆమె హీరోయిన్ గా చేసేప్పటి కంటే కూడా అధికంగా మీటూ ఉద్యమం సమయంలో ప్రచారం దక్కించుకున్న విషయం తెల్సిందే. దేశవ్యాప్తంగా కూడా ఆమె మీటూ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇండియాలో మీటూ ఉద్యమం మొదలు అవ్వడంకు ప్రధాన కారణం ఆమె అనడంలో సందేహం లేదు.

తాజాగా మరోసారి తనుశ్రీ దత్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ఉజ్జయిని లో ఉన్న సమయంలో నన్ను చంపేందుకు ప్రయత్నాలు చేశారు. చాలా మంది చాలా రకాలుగా నాపై హత్యకు కుట్ర పన్నారు అంటూ ఆమె ఆరోపించింది. రెండు సార్లు కూడా నా కారు యొక్క బ్రేక్స్ ను తొలగించి చంపేందుకు ప్రయత్నించారు అంటూ ఆరోపించింది. ఆ ప్రమాదం నుండి తాను తృటిలో తప్పించుకున్నాను అంది.

కారు బ్రేక్‌ లు తీసిన సమయంలో తనకు చిన్న గాయాలు కూడా కాకుండా బయట పడ్డాను. బాలీవుడ్‌ కు చెందిన మాఫియా మిత్రుల వల్ల నాకు ప్రాణ హాని ఉందని ఆమె పేర్కొంది. అంతే కాకుండా తన తల్లి తరపు తాత తో కూడా తనకు ప్రాణ హాని ఉందంటూ ఆమె తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసి మీడియా దృష్టిని ఆకర్షించింది.

తనుశ్రీ దత్తా చాలా కాలంగా నానా పటేకర్‌ పై మీటూ ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే. కొన్ని సంవత్సరాల క్రితం ఆయనతో నటిస్తున్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది. ఆయన పై పోలీసు కేసు వరకు వెళ్లింది.

ఆయన కూడా పరువు నష్టం దావా వేశాడు. ఇద్దరి మధ్య న్యాయ పోరాటం సాగుతుంది. ఈ సమయంలో తనుశ్రీ దత్తా చేసిన హత్య ప్రయత్నం వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఆమెను చంపేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు అంటూ బాలీవుడ్‌ తో పాటు మీడియాలో కూడా చర్చ జరుగుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News