జర్నలిజం చెడిపోయింది అంటూ హీరో హీరోయిన్లు తిట్టడం. అసలు హీరో హీరోయిన్లే సరిగ్గా క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు అంటూ మీడియావారు చురకలు వేయడం ఇప్పుడు బాగా కామన్ అయిపోయింది. మరోసారి తన వ్యాఖ్యాలతో అలాంటి చిక్కులే కొనితెచ్చుకుంది హీరోయిన్ తాప్సీ.
''పింక్'' సినిమా ట్రైలర్ జనాలకు కనక్ట్ అవ్వడంతో.. ఒక్కసారిగా తాప్సీకి ఎక్కడలేని స్టార్డమ్ వచ్చిపడింది. అయితే ట్రైలర్లు జనాలను మిస్ లీడ్ చేస్తూ ఆసక్తిని పెంచడానికే అని అందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ చూస్తే అయితే తాప్సీ తనకు తానే ఎవరితోనైనా సెక్స్ లో పాల్గొని అతన్ని చంపేసి ఉండాలి.. లేదంటే రేప్ కు గురై ఉండాలి అని అర్ధమవుతోంది. ఇదే విషయంపై మొన్న మాట్లాడుతూ.. నేను రేప్ విక్టిమ్స్ గురించి తెలుసుకుని ఏడ్చేసేదానిని.. సినిమాలో ఆ పాత్రను ప్లే చేయడం చాలా బరువుగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.
కట్ చేస్తే.. ఇప్పుడు ఒక పత్రిక తాప్సీ ఇంటర్యూ ఒకటి ప్రచురించి.. ''నేను రేప్ విక్టిమ్ పాత్రను పోషిస్తున్నా'' అంటూ హెడ్డింగ్ పెట్టింది. దీనిపై స్పందించిన తాప్సీ.. అసలు ఎవరు చెప్పారు నేను ఆ పాత్రను పోషిస్తున్నానని? మీకు ఈ ఇంటర్యూ ఎవరిచ్చారు? రెస్పాన్సిబుల్ జర్నలిజం ఏమైంది? అంటూ చురకలు వేస్తోంది. కావాలనే పబ్లిసిటీ కోసం ఈ రచ్చ చేస్తోందా అనే సందేహం వస్తోంది జనాలకు. అది సంగతి.