ఝుమ్మంది నాదం సినిమా తో కుర్రకారు గుండెల్లో గిటార్ వేయించిన తాప్సి పన్ను కు తెలుగు లో పెద్ద చెప్పుకోదగ్గ అవకాశాలు లేనప్పటికీ హిందీ లో మాత్రం కెరీర్ బానే సాగుతోంది. కానీ ఈమె దూరదృష్టమో ఏమో కాని ఈమె ఏం మాట్లాడినా జనాలు పెడర్ధాలు తీసేస్తున్నారు. మళ్ళీ ఈమె వచ్చి అది కాదు మొర్రో అని చెప్పుకోవలసి వస్తోంది.
సోషల్ మీడియా లో ఈమధ్యనే చేసిన ఒక పోస్ట్ వల్ల ఇరకాటంలో పడింది మన ఆనందో బ్రహ్మ దెయ్యం. ఎదో పోస్ట్ బావుంది కదా అన్ని షేర్ చేస్తే మీడియా వాళ్లు ఏదేదో ఊహించేసుకుని ఎక్కడికో వెళ్లిపోయారు. చివరకు తాప్సి దిగొచ్చి అది కాదు తన ఉద్దేశం అని చెప్పింది. తన ట్విట్టర్ లో పెళ్లి గురించి ఎదో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ మొత్తం అబ్బాయిలు అనవసరంగా పెళ్లంటే భయపడతారు అని మొదలై - పెళ్లికి ఎప్పుడు నో చెప్పొద్దూ అంటూ ముగుస్తుంది. కాగా, ఇది చదివిన ఒక మీడియా తాప్సి పెళ్లి కి యెస్ అంటోంది అంటూ న్యూస్ రాసేశారు. ఇది చూసిన తాప్సి కి చిర్రెత్తుకొచ్చింది.
ఇంకా ఆపండి. గెట్ ఏ లైఫ్ అంటూ ఆ మీడియా ఛానెల్ కు చెప్తూనే నిజమైన న్యూస్ రాయండి అంటూ వార్నింగ్ కూడా ఇవ్వకనే ఇచ్చింది. అయినా పెళ్లికి నో చెప్పొద్దూ అంటూ పోస్ట్ పెట్టినంత మాత్రాన తను పెళ్లి కి ఎస్ అంటుంది అని అనుకుంటే ఎలా చెప్పండి?