Jr NTR తెర‌వెన‌క మంత్రాంగం షాకిస్తోందే

Update: 2022-11-28 04:45 GMT
RRR ముందు RRR తర్వాత స‌న్నివేశం మారిపోయింది. RRRతో పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని అందుకున్నాడు తార‌క్. ఇప్పుడు అందుకు త‌గ్గ‌ట్టు త‌న లైన‌ప్ ని అమోఘంగా బ‌లోపేతం చేస్తున్నాడు. అత‌డు వ‌రుస‌గా పాన్ ఇండియా డైరెక్ట‌ర్ల‌తో మంత‌నాలు సాగిస్తున్నాడ‌న్న‌ది తాజా గుస‌గుస‌.

తార‌క్ న‌టించాల్సిన ఎన్టీఆర్ 30 ఇంకా రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌లేదు.  RRR తర్వాత చాలా విరామం తీసుకున్నాడు. కానీ తాజా స‌మాచారం మేర‌కు.. ఎన్టీఆర్ 2023లో క్ష‌ణం తీరిక లేని షెడ్యూళ్ల‌తో గ‌డ‌ప‌నున్నాడ‌ని తెలిసింది.

ఏడాదంతా కాల్షీట్లు ప్యాక్ అయిపోయాయ‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. వ‌చ్చే ఏడాది వ‌రుస‌గా మూడు నాలుగు సినిమాల‌కు లైన్ క్లియ‌ర్ చేసుకుంటున్నాడ‌ని కూడా టాక్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ ఈ డిసెంబర్ లేదా జనవరిలో ప్రారంభం కానుంది. అతను ఎక్కువ విరామం లేకుండా వరుస షెడ్యూల్‌లలో షూటింగును పూర్తి చేస్తాడు.

ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31 చిత్రీక‌ర‌ణ‌కు వెళుతుంది. 2023 చివరిలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమవుతుంది.

ఈ చిత్రం కూడా ఎక్కువ విరామం లేకుండా శరవేగంగా పూర్తి చేయాల‌న్న‌ది ప్లాన్. ఇవేగాక వేగంగా షూటింగులు పూర్తి చేయడానికి ప‌లు భారీ ప్రాజెక్ట్‌లను లైన్ లో ఉంచిన ఎన్టీఆర్ అతి త్వరలో దూకుడైన ప్ర‌క‌ట‌న‌ల‌తో దూసుకొస్తాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చూస్తుంటే ఇత‌ర పాన్ ఇండియా స్టార్ల‌తో తార‌క్ వార్ న‌డిపించేందుకు అన్ని అస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నాడ‌నే భావించాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News