మొదటిరోజే మొత్తం వెనక్కు తెచ్చిన రౌడీ

Update: 2018-11-18 09:07 GMT
విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'టాక్సీవాలా' నిన్న శనివారం రిలీజ్ అయింది. సినిమాకు విడుదలకు ముందు పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. రా-ఫుటేజ్ లీక్ కావడంతో సినిమాకు ఖచ్చితంగా నష్టం జరుగుతుందని కొంతమంది భావించారు. పైగా ఈ సినిమా మొదలై ఇప్పటికే దాదాపు రెండేళ్ళయింది. ఎన్నోసార్లు వాయిదాలు పడి రిలీజవుతున్న సినిమా కావడంతో పెద్దగా హైప్ కూడా లేదు.

కానీ మొత్తం మీద ఉన్న ప్లస్సులు ఏంటంటే.. విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న క్రేజ్.. గీతా ఆర్ట్స్-యూవీ క్రియేషన్స్ బ్యానర్ల రెప్యుటేషన్.  మినిమిమ్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో భారీ టార్గెట్ లేదు. ఫైనల్ టార్గెట్ ఎంతంటే జస్ట్ నాలుగు కోట్లే.  చాలా ఏరియాల్లో నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. సినిమా బడ్జెట్ తక్కువ కావడంతో మొదటి రోజే సినిమా బ్రేక్ ఈవెన్ అయింది.  తెలుగు రాష్ట్రాల్లోనే రూ.2.81 కోట్ల షేర్ సాధించింది.

సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ చూస్తుంటే నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొచ్చే సినిమాలాగానే ఉంది.  'టాక్సీవాలా' విడుదలకు ఒకరోజు ముందుగా రిలీజ్ అయిన 'అమర్ అక్బర్ అంటోనీ' కి మిక్స్డ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ సినిమాకు పోటీ కూడా లేనట్టే. 'టాక్సీవాలా' మొదటి రోజు ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం - 1.46 cr
ఉత్తరాంధ్ర - 0.39 cr
సీడెడ్ - 0.39 cr
ఈస్ట్ - 0.19 cr
వెస్ట్ - 0.16 cr
కృష్ణ - 0. 23 cr
గుంటూరు - 0. 25 cr
నెల్లూరు - 0.13 cr

ఏపీ+తెలంగాణా టోటల్ - 2.81 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా- 0.49 cr

టోటల్ - రూ.3.3 కోట్ల షేర్
 
Tags:    

Similar News