వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన `లక్ష్మీస్ ఎన్టీఆర్` చిత్రంపై మరో పిటీషన్ దాఖలైంది. ఈ చిత్ర విడుదలను ఎట్టి పరిస్థితుల్లో ఆపాల్సిందే అంటూ టీడీపీ ప్రతినిధి, నటి దివ్యవాణి ఎపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. మరో రెండు రోజుల్లో `లక్ష్మీస్ ఎన్టీఆర్` విడుదలకు సిద్ధమవుతున్న వేళ టీడీపీకి చెందిన దివ్యవాణి ఆ చిత్ర విడుదలను ఆపమంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం కొత్త డ్రామాకు తెరతీసింది. ఈ చిత్రాన్ని వాస్తవాలకు విరుద్ధంగా తెరకెక్కించారంటూ దివ్యవాణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
టీడీపీ నేత అయిన ఎన్టీఆర్ జీవిత కథని వైసీపీకి చెందిన నేత నిర్మించడం కుట్రలో భాగమేనని, అందుకే ఈ చిత్రాన్ని ఎన్నికల వేళ విడుదల చేయరాదంటూ దివ్యవాణి ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఎన్నికల కోడ్ అమలులో వుండగా బయోపిక్ లు విడుదల చేయరాదనే నిబంధన వుంది. దాని ప్రకారం `లక్ష్మీస్ ఎన్టీఆర్` విడుదలను నిలిపివేయాల్సిందే అంటూ దివ్యవాణి చంద్రబాబు నాయుడుపై తనకున్న స్వామిభక్తిని ప్రదర్శించడంపై వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. 16 ఏళ్ల యువకుడు 1982 నుంచి టీడీపీకి ఓటేస్తున్నాడని చెప్పినప్పుడే దివ్యవాణి మైండ్ ఏ రేంజ్‌లో పనిచేస్తుందో అర్థమయిందని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
అన్ని పనులు పూర్తి చేసుకుని ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా సినిమాని రిలీజ్ చేసేందుకు ఆర్జీవీ అండ్ టీమ్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కమీషన్ సహా అన్ని వైపుల నుంచి రిలీజ్ కి క్లియరెన్స్ వచ్చేసిందని చిత్రయూనట్ ప్రకటించింది. ఆ మేరకు రిలీజ్ తేదీతో పోస్టర్లను ముద్రించింది. ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లోనూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.