అనుష్క సినిమా షూటింగ్ లో ఘోరం

Update: 2017-08-31 07:08 GMT
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న కొత్త సినిమా ‘పరి’ షూటింగ్ సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. కోల్ కతాలోని కరోల్‌ బెరియా ప్రాంతంలో ఔట్‌ డోర్ షూటింగ్ జరుగుతుండగా కరెంటు తీగ తాకడంతో షా ఆలమ్ అనే 28 ఏళ్ల కుర్రాడు ప్రాణాలు కోల్పోయాడు. అతను ఈ చిత్ర టెక్నీషియన్లలో ఒకడని అంటున్నారు. మృతుడు ఉత్తరప్రదేశ్‌ వాసి అని తెలిసింది.

 షా షూటింగ్ ముగిసిన అనంతరం లొకేషన్‌ లోని ఓ వెదురు పొదలో కరెంటు తీగను పొరబాటున ముట్టుకుని విద్యుదాఘాతానికి గురైనట్లు తెలుస్తోంది. సెట్లో నటులు - వస్తువులపై వెలుగు పడేలా వెదురు పొద చుట్టూ యూనిట్ సభ్యులు లైటింగ్ ఏర్పాటు చేశారు. ఐతే షా అక్కడి లైవ్ వైర్లలోని ఒకదాన్ని పట్టుకున్నట్లు తెలుస్తోందని ఒక పోలీసు అధికారి తెలిపారు. కరెంటు షాక్ తగిలాక షాను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ దుర్ఘటనతో ‘పరి’ షూటింగ్‌ ను తాత్కాలికంగా నిలిపేశారు.

అనుష్క నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘పరి’తో ప్రాశిత్ రాయ్ అనే కొత్త దర్శకుడు బాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు. కొన్ని నెలల కిందట రిలీజ్ చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ చర్చనీయాంశమైంది. అనుష్క డీగ్లామరస్ గా కనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ లోని ఇంటెన్సిటీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

Tags:    

Similar News