ప్రచారం పలు రకాలు. వివాదంతో ప్రచారం, వేరొకరిని విమర్శించడం ద్వారా ప్రచారం.. లేదా కంటెంట్ లో వివాదంతో ప్రచారం చేసుకోవచ్చు. వీటిలో రెండోది తేజకి బాగా ఇష్టం. డైరెక్టర్ తేజ నిన్నటి రోజున సూపర్ స్టార్ మహేష్ ని విమర్శించి తీవ్రంగా అబాసు పాలయ్యాడు. అతడిపై మహేష్ అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఊళ్లను దత్తత తీసుకోవడం అనేది ప్రభుత్వాలు ఇచ్చే పన్ను మినహాయింపుల కోసమే. కార్పొరెట్ కూడా అదే చేస్తుంది. మహేష్ అదే చేశాడు. అంతే తప్ప జనాలపై ప్రేమతో కాదు. .. అంటూ విమర్శించాడు. ఒకవేళ చారిటీ పనులు చేయాలనుకుంటే ఒక్కడు టైమ్‌లోనే చేసేవాడు కదా! అంటూ చెణుకులు వేశాడు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. తేజ కామెంట్ ని ప్రిన్స్ అభిమానులు సీరియస్ గా తీసుకున్నారు.
అందుకే ఈరోజు తేజ దానికి క్లారిటీ ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. నిన్న ప్రసారమైన వెబ్ వీడియోలో నేనేం మాట్లాడానో పూర్తిగా వేయలేదు. రెండో లైన్ కట్ చేసి కేవలం వివాదం పార్ట్ కట్ చేసి ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరూ చేసేది అదే. కానీ మహేష్ అలాంటి ఇంటెన్షన్‌తో చేయలేదు. హ్యాట్సాఫ్ టు హిమ్.. అన్నాన్నేను. కానీ ఈ లైన్ కట్ చేసి వీడియో వేశారు.. అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. జయం తర్వాత మహేష్ తో నిజం చేశాను. అతడిపై ఓ సన్నివేశానికి 30టేకులు తీసుకున్నా. ఆ సీన్ వేరొక హీరో చేయనేలేరు. అదే సీన్ వేరొకరితో అయితే ఇంకా ఎక్కువ టేకులు తినేదే. మహేష్ యూనిక్ యాక్టర్ అంటూ పొగిడేసే ప్రయత్నం చేశాడు. కాల్చి వెన్న పూయడం అంటే ఇదే మరి! ఈపాటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తే ఏం లాభం? ఎలాగైనా సినిమాకి ప్రచారం వచ్చిందిలే .. కానివ్!!