మూవీ మేకింగ్ లో ట్రెండ్ సెట్టర్ గా గుర్తింపు పొంది.. తన స్టైల్ లో తప్ప మరో టైపులో సినిమాలు చేయడని అనిపించుకుని.. వరుస డిజాస్టర్లలో డీలా పడ్డ దర్శకుడు తేజ.. గతేడాది తీసిన నేనే రాజు నేనే మంత్రి మూవీతో సడెన్ గా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. బడా సినిమాలకు ఈయన పేరును పరిశీలించేశారు మేకర్స్.
తనకు బ్రేక్ ఇచ్చిన దగ్గుబాటి ఫ్యామిలీతోనే తన మరుసటి చిత్రం చేయాలని నిర్ణయించుకున్న తేజ.. వెంకటేష్ తో ఆట నాదే వేట నాదే సినిమాను అనౌన్స్ చేశాడు. టైటిల్ చెప్పకపోయినా.. మూవీ అధికారికంగా ప్రారంభమైంది. ఇదే సమయంలో.. బాలకృష్ణ హీరోగా రూపొందే ఎన్టీఆర్ బయోపిక్ ఆఫర్ కూడా తేజ తలుపుతట్టింది. రెండు సినిమాలకు ఓకే చెప్పేసిన తేజ.. ఒకేసారి ఈ రెండు మూవీస్ ను హ్యాండిల్ చేయాలని భావించాడట. అయితే.. రెండు నెలల వర్క్ తర్వాత వెంకీ మూవీ నుంచి డ్రాప్ కావడమే బెటర్ అని నిర్ణయించుకుని.. అక్కడ చెప్పేయడంతో ఆ సినిమా ఆగిపోయింది.
కానీ తానొకటి తలిస్తే అన్న చందంగా.. ఎన్టీఆర్ విషయంలో కూడా తేడా కొట్టేసింది. క్రియేటివ్ డిఫరెన్సుల కారణంగా.. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తేజ తనకు తానే తప్పుకోవాల్సి వచ్చింది. అయితే.. తేజతో సినిమా అనుకున్న వెంకీ ఇప్పుడు అనిల్ రావిపూడితో ఎఫ్2 కి రెడీ అయిపోయాడు. వేరే దర్శకుడితో కానీ.. తనే స్వయంగా దర్శకత్వం వహించి కానీ ఎన్టీఆర్ ను పూర్తి చేయనున్నారు బాలయ్య. మరి తేజ సంగతేంటి అన్న విషయమే ఇప్పుడు డోలాయమానంలో పడిపోయింది.