తెలుగు సినిమాను ‘శివ’ తర్వాత.. ‘శివ’కు ముందు అని విభజించి మాట్లాడుకోవచ్చు. అంతగా ప్రభావం చూపిందా సినిమా. రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ సినిమాకు అనేక బాధ్యతలు పంచుకున్నట్లు దర్శకుడు తేజ. స్క్రిప్టు దగ్గర్నుంచి విడుదలయ్యే వరకు తాను అనేక విభాగాల్లో పని చేశానని.. ఆ సినిమాకు పబ్లిసిటీ ఇన్ఛార్జ్ కూడా తానేనని చెబుతూ.. ఆ సినిమా పబ్లిసిటీకి సంబంధించి కొన్ని ఆసక్తికర సంగతుల్ని తేజ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
అప్పటి వరకు తెలుగు సినిమాల పోస్టర్లలో టైటిల్ కు పసుపు రంగే వేసేవాళ్లని.. కానీ తాను తొలిసారిగా టైటిల్ కు ఎరుపు వాడానని తేజ చెప్పాడు. ఐతే నేషనల్ లితో ప్రింటర్స్ బాబు ఈ విషయమై అభ్యంతర పెట్టారని.. ఎరుపు అయితే సరిగా కనబడదని అనడంతో తాను ఎరుపు రంగు తీసేయకుండానే లోగో మీద పసుపు గీతలు వేయించినట్లు తేజ చెప్పాడు. ఈ టైటిల్ లోగోలో కనిపించే నాగ్ ఫొటో ‘శివ’ కోసం తీసింది కాదని తేజ వెల్లడించాడు. ‘విక్కీదాదా’ కోసం చేసిన ఫొటో షూట్ నుంచి ఈ ఫొటో తీసి ‘శివ’ లోగో డిజైన్ చేసినట్లు తేజ చెప్పాడు. ఇక టైటిల్ మీద నాగ్ సైకిల్ చైన్ పట్టుకున్నట్లుగా ఉంటుందని.. కానీ అక్కడ కనిపించే చెయ్యి నాగార్జునది కాదని.. ఆయన అన్నయ్య అక్కినేని వెంకట్ చెయ్యి అదని తేజ తెలిపాడు. ‘శివ’ సినిమాకు తాను నెలకు రూ.1500 చొప్పున జీతం తీసుకున్నట్లు తేజ వెల్లడించాడు.