హంటర్ కి హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్న తేజస్వి

Update: 2016-11-07 09:30 GMT
 తెలుగమ్మాయి తేజస్వి మదివాడ.. మెల్లమెల్లగా కెరీర్ లో స్పీడ్ పెంచుతోంది. ఇప్పటివరకూ చాలానే సినిమాల్లో చేసినా.. పెద్దగా బ్రేక్ సంపాదించలేకపోయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు శ్రీనివాస్ అవసరాల లీడ్ రోల్ లో చేస్తున్న హంటర్ రీమేక్ లో హీరోయిన్ గా ఎంపికైంది. హంటర్ మూవీలో ముగ్గురు భామలు ఉంటారు. రాధికా ఆప్టే.. సాయి తమ్హన్ కర్.. వీరా సక్సెనాలు యాక్ట్ చేయగా.. వీరిలో వీర చేసిన కాలేజ్ అమ్మాయి పాత్రను పోషిస్తున్నట్లు చెప్పింది తేజస్వి.

'శ్రీనివాస్ అవసరాల పాత్రకు యంగ్ ఏజ్ లో గాళ్ ఫ్రెండ్ అయిన కాలేజ్ అమ్మాయి రోల్ చేస్తున్నాను. పూరీ జగన్నాధ్ తీసిన హార్ట్ ఎటాక్ మాదిరిగా.. మరోసారి నన్ను యంగ్ బ్యూటీగా చూపించబోతున్నారు. నేను ఈ సినిమాలో అమాయకమైన అమ్మాయి పాత్రను పోషిస్తున్నా. కనీసం ప్రేమ అంటే ఏంటో.. ఈ కుర్రాడు ఎలాంటివాడో తెలియని రోల్. అయితే ఇదంతా సినిమాలో మాత్రమే. రియల్ లైఫ్ లో నేను చాలా స్మార్ట్' అంటూ నవ్వేస్తోంది తేజస్వి.
అయితే.. హంటర్ మూవీని పూర్తిగా చూడలేదని.. అక్కడక్కగా కొన్ని బిట్స్ మాత్రమే చూశానని చెప్పిందీ యంగ్ బ్యూటీ. 'పూర్తిగా చూస్తే.. ఆ రోల్ ని కాపీ చేసే ప్రమాదం ఉంటుంది. నేను నా ఒరిజినల్ యాక్టింగ్ నే చూపించాలని అనుకుంటున్నా. హంటర్ చూస్తా కానీ.. ఇప్పుడప్పుడే కాదు. చాలా టైం ఉంది' అని చెప్పింది తేజస్వి మదివాడ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News