దిల్‌ రాజుకు చేదోడు వాదోడుగా తేజస్వినీ

Update: 2021-02-04 14:50 GMT
కొత్త వారిని ఎంకరేజ్ చేయడంలో దిల్‌ రాజు ముందు ఉంటారు అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఉన్న స్టార్ దర్శకుల్లో పలువురిని దిల్ రాజు పరిచయం చేశాడు. కొత్త వారితో వర్క్‌ వల్ల కొత్త ఐడియాలు రావడంతో పాటు తక్కువ పారితోషికంతోనే మంచి సినిమాలు వస్తాయనే ఉద్దేశ్యంతో తన ఆఫీస్ లో నెల వారి జీతాలు ఇచ్చి పదుల సంఖ్యలో రైటర్లను కొనసాగిస్తూ వస్తున్నాడు. ప్రతి రోజు ఎన్నో కథలు వింటూ ఉండే దిల్‌ రాజు ఒత్తిడిని తగ్గించేందుకు ఆయన భార్య తేజస్విని సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. స్వతహాగా రచయిత అయిన తేజస్విని ఒక వైపు సొంతంగా కథలు సిద్దం చేయడంతో పాటు తమ వద్ద ఉన్న రైటర్ల వద్ద ఉన్న కథల విషయంలో కూడా చర్చల్లో పాల్గొంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

తేజస్వినీ పలు కథలను రాశారట. అందులో కొన్ని కథలను సినిమాలుగా తీసేందుకు దిల్‌ రాజు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. మొదటగా ఒక కథను పూర్తి స్క్రిప్ట్ రెడీ చేస్తే సినిమా మొదలు పెట్టాలని దిల్‌ రాజు భావిస్తున్నాడు. ఇప్పటికే తేజస్వినీ రాసిన కథలు నచ్చడంతో ఆమెకు సినిమాగా చేసేందుకు దిల్ రాజు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే తేజస్వినీ రాసిన కథతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. కథల విషయంలో పట్టు ఉండటం వల్ల దిల్ రాజుకు తేజస్వినీ చేదోడు వాదోడుగా ఉండే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు గుసగుసలాడుకుంటున్నారు.


Tags:    

Similar News