టీ ఎన్నికలు.. శౌర్య మూవీ ఎఫెక్ట్‌

Update: 2018-10-28 13:23 GMT
‘ఛలో’ చిత్రంతో సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కిన నాగశౌర్య ఆ వెంటనే ‘నర్తనశాల’ చిత్రాన్ని చేసి పెద్ద తప్పులో కాలేశాడు. నర్తనశాల ఫలితం తారు మారు అవ్వడంతో ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది. నాగశౌర్య తదుపరి చిత్రం మళ్లీ సొంత బ్యానర్‌ లోనే ఉంటుందని - మరోసారి కొత్త దర్శకుడితో పూర్తి ఎంటర్‌ టైనర్‌ గా ఉండబోతుందని ఆయన సన్నిహితులు చెప్పారు. కథ కోసం ఎదురు చూస్తున్న సమయంలో నిర్మాత భవ్య ఆనంద్‌ ప్రసాద్‌ ఒక కథతో శౌర్య వద్దకు రావడం, ఆ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పి సినిమాను కూడా ప్రారంభించడం జరిగింది.

భవ్య క్రియేషన్స్‌ లో నాగశౌర్య - ఈషా రెబ్బా జంటగా చిత్రాన్ని ప్రారంభించి మొదటి షెడ్యూల్‌ ను పూర్తి చేశారు. అంతలోనే కథలో మార్పులని - హీరోయిన్‌ ను మార్చాలని సినిమా ఆపేశారు. ఈలోపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీడీపీ తరపున శేరిలింగంపల్లి బరిలో నిలిచేందుకు నిర్మాత ఆనంద్‌ ప్రసాద్‌ సిద్దం అవుతున్నారు. మహాకూటమిలో భాగంగా శివ ప్రసాద్‌ కు ఆ సీటును కేటాయించడం ఖాయం అయినట్లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాణ విషయాలను పక్కన పెట్టి రాజకీయాలపై పూర్తి ఫోకస్‌ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు సినిమా మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశాలు లేవు. ఎన్నికల ఫలితాల్లో తేడా కొడితే అప్పుడు సినిమా పూర్తిగా క్యాన్సిల్‌ అయ్యే అవకాశం కూడా ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి శౌర్య మూవీకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అడ్డు తగిలాయి. మరి ఆనంద్‌ ప్రసాద్‌ కోసం ఎదురు చూస్తాడా లేదంటే శౌర్య కొత్త సినిమా మొదలు పెడతాడా చూడాలి.
Tags:    

Similar News