తమ హీరో దర్శనాన్ని మామూలు జనాల కంటే ముందు చూసేయాలని అభిమానులు చాలా ఆత్రుతతో ఉంటారు. ఈ ఆత్రుతను క్యాష్ చేసుకునే దోపిడీదారులు ఈ మధ్య బాగా ఎక్కువైపోయారు. చారిటీ షో అని.. ఇంకేదో అని కల్లబొల్లి కబుర్లు చెప్పి ఏ అర్ధరాత్రో.. తెల్లవారుజామునో బెనిఫిట్ షో వేయడం.. దానికి వెయ్యి రూపాయలో పదిహేను వందలో రేటు పెట్టడం.. ఇష్టం వచ్చినట్లు దోచుకోవడం.. ఇదీ వరస. పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు.. లాంటి సూపర్ స్టార్ల సినిమాలకు ఈ దోపిడీ మరీ ఎక్కువైపోయింది.
మొన్నటికి మొన్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టికెట్లను 2 వేల రూపాయలకు కూడా అమ్మింది ఈ దోపిడీ బ్యాచ్. అంతకుముందు ‘బాహుబలి’ సినిమాకు ఇంకా భారీ స్థాయిలో దోపిడీ జరిగింది. ‘శ్రీమంతుడు’ సినిమాకు కూడా అభిమానుల జేబులకు బాగానే చిల్లుపడింది. ఇలాంటి షోలు వేయడానికి పోలీస్ పర్మిషన్ కోసం ప్రభుత్వానికి ఏ మూడు వేలో ఐదు వేలో కడతారంతే. ఆదాయంలో డిస్ట్రిబ్యూటర్ కు ఇవ్వాల్సింది ఇచ్చేసి.. మిగతాదంతా అభిమానులుగా చెప్పుకునే ఈ దోపిడీ బ్యాచే జేబుల్లో వేసుకుంటూ ఉంటుంది.
ఈ బెనిఫిట్ షోల విషయంలో వీళ్ల ఆగడాలు ఇంకా చాలానే ఉంటాయి. అర్ధరాత్రి 12 గంటలకో ఒంటిగంటకో షో అంటారు. తీరా థియేటర్ దగ్గరికెళ్తే.. గంటలు గంటలు వెయిటింగ్. ఏ 4 గంటలకో 5 గంటలకో షో వేస్తారు. వేలకు వేలు పెట్టి టికెట్లు కొన్న అభిమానులకు ఈ వెయిటింగ్ బోనస్ అన్నమాట. పాపం అభిమానులు కాబట్టి అన్నీ భరించాల్సిందే. వెయ్యి రూపాయలు సంపాదించడానికి నాలుగైదు రోజులు కష్టపడే వాడు కూడా.. తమ హీరో మీద అభిమానంతో అంత రేటు పెట్టి వెర్రిగా సినిమాకు వెళ్లిపోతాడు. ఈ దోపిడీ బ్యాచ్ కు కావాల్సింది ఈ వెర్రి అభిమానమే.
ఐతే తెలంగాణ పోలీస్ అధికారుల్లో ఎందుకు కదలిక వచ్చిందో తెలియదు కానీ.. మొన్న ‘సరైనోడు’ సినిమాకు రాష్ట్రంలో ఎక్కడా బెనిఫిట్ షోలకు అనుమతులివ్వలేదు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు బాగా సొమ్ము చేసుకున్న దోపిడీ బ్యాచ్ ఈ సినిమాకు కూడా భారీ లెవెల్లోనే బెనిఫిట్ షోలు ప్లాన్ చేసింది. కానీ పోలీసుల నిర్ణయంతో ఈ బ్యాచ్ కు నోట్లో వెలక్కాయ పడ్డట్లయింది. ఇంతలో తెలంగాణ వ్యాప్తంగా రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనతో ప్రభుత్వం ముందుకొచ్చింది. ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు తొలి రోజు వరకు అందుకు పర్మిషన్ కూడా వచ్చేసింది. అన్ని సింగిల్ స్క్రీన్లలోనూ ఉదయం 8కే షో పడబోతోంది. థియేటర్ల దగ్గర బ్లాక్ మార్కెట్ అన్నది ఎప్పట్నుంచో ఉన్నదే. ఐతే అక్కడ టికెట్ 70 ఉంటే మహా అయితే 200కు అమ్ముతారు. ఇది కూడా దోపిడీనే అయినా.. బెనిఫిట్ షోల దోపిడీతో పోలిస్తే ఇది చాలా నయం. ఐతే ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షోల సంగతేంటో ఇంకా క్లారిటీ లేదు. ఐతే తెలంగాణ వరకు దోపిడీకి అడ్డుకట్ట పడ్డట్లే.