టాలీవుడ్ కి ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ చాలా ముఖ్యం అయింపోయింది. మిలియన్ డాలర్స్ అందుకునేందుకు అన్ని సినిమాలు కష్టపడుతున్నాయి. 2016లో మాత్రం ఇలా మిలియన్ మార్క్ ను అందుకున్న సినిమాల కౌంట్ ఎక్కువగానే ఉండడం.. అక్కడి మార్కెట్ లో టాలీవుడ్ ఎలా పాగా వేస్తోందో చెప్పడానికి నిదర్శనం.
ఈ ఏడాది అ..ఆ., నాన్నకు ప్రేమతో.. జనతా గ్యారేజ్.. 24.. ఊపిరి.. పెళ్లి చూపులు.. బ్రహ్మోత్సవం.. సర్దార్ గబ్బర్ సింగ్.. ధృవ.. చిత్రాలు వన్ మిలియన్ మార్క్ ను అధిగమించాయి. అంటే మొత్తం 9 సినిమాలు ఈ మార్క్ ను దాటాయన్న మాట. ఇప్పటివరకూ ఒక ఏడాదికి సంబంధించి ఇదే అత్యధికం. వీటిలో త్రివిక్రమ్ మూవీ అ..ఆ.. 2.44 మిలియన్ డాలర్లను వసూలు చేసి.. యూఎస్ బాక్సాఫీస్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలవగా.. ఆ తర్వాతి స్థానంలో 2.02 మిలియన్ డాలర్లను వసూలు చేసిన నాన్నకు ప్రేమతో నిలిచింది.
వీటితో పాటు జెంటిల్మెన్ కూడా వన్ మిలియన్ మార్క్ కు దగ్గరగా వచ్చి ఆగిపోగా.. నాగ చైతన్య మూవీ ప్రేమమ్.. శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో వచ్చిన జ్యో అచ్యుతానంద.. నిఖిల్ మూవీ ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీస్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన నిర్మాతలు భారీ లాభాలు అందుకున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/