ఈ వారం కొత్త సినిమాలు వచ్చాయ్ కానీ.. ఆకట్టుకున్నది ఒక్కటి కూడా లేదు. దీంతో గత వారం రిలీజ్ లకే జనాలు ఓటేశారు. ముఖ్యంగా దసరా పండగ వెళ్లిపోయినా.. నాగ చైతన్య ప్రేమమ్ కి మాత్రం ఇంకా పండగ పూర్తి కాకపోవడం విశేషం.
1. ప్రేమమ్: ముందు నుంచి అనుకున్నట్లుగానే ఈ ఏడాది దసరా రేస్ లో ప్రేమమ్ విజేతగా నిలిచింది. వీకెండ్ తర్వాత కూడా మరో మూడ్రోజులు సెలవలు ఉండడం బాగానే కలిసొచ్చింది. అంతలోనే సెకండ్ వీకెండ్ కూడా వచ్చేయడంతో.. టికెట్ కౌంటర్ల దగ్గర ప్రేమమ్ మూవీ పండగ చేసుకుంటోంది. ఫస్ట్ వీక్ తో పోల్చితే వసూళ్లు తగ్గినా.. ఇంకా మంచి కలెక్షన్సే వస్తున్నాయి. అయితే.. బీ-సీ సెంటర్లలో మాత్రం ప్రేమమ్ సిట్యుయేషన్ అంత గొప్పగా ఏమీ లేదు.
2. నాగభరణం: కోడి రామకృష్ణ తీసిన గ్రాఫికల్ మూవీ నాగభరణంకి ప్రమోషన్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. గతంలో అరుంధతి లాంటి సినిమా ఇచ్చిన డైరెక్టర్ కావడం.. ట్రైలర్స్ లో కూడా విజువల్స్ ఆకట్టుకోవడంతో.. ఆ జోనర్ జనాలతో తొలిరోజు థియేటర్లు బాగానే నిండాయి. కానీ టాక్ దారుణంగా ఉండడంతో.. ఆ నెక్ట్స్ డే నుంచే పరిస్థితిలో తేడా వచ్చేసి.. థియేటర్లు ఖాళీ అయిపోయాయి.
3. అభినేత్రి: మిల్కీ బ్యూటీ తమన్నా.. డ్యాన్సింగ్ హీరో ప్రభుదేవాలు జంటగా నటించిన అభినేత్రికి రెండో వారాంతంలో వసూళ్లు కాస్త పుంజుకున్నాయి. కానీ ఈ మూవీ సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే చాలా దూరం ఉంది. అంత లాంగ్ జర్నీ అభినేత్రికి కష్టమే అన్నది ఇండస్ట్రీ టాక్.
4. ఈడు గోల్డ్ ఎహె: సునీల్ మూవీ ఈడు గోల్డ్ ఎహె పుంజుకుంటుందనే అంచనాలకు బ్రేక్ పడ్డట్టే. సాధారణంగా సినిమా బ్యాడ్ గా ఉన్నా.. సునీల్ సినిమాకి బీ సీ సెంటర్లలో డబ్బులొచ్చేస్తాయి. కానీ ఈడు గోల్డ్ ఎహెను ఆ జనాలు కూడా తిప్పికొట్టారనే సంగతి కౌంటర్లలో తెగుతున్న టికెట్లను చూస్తే అర్ధమవుతుంది.
5. హైపర్: ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన హైపర్.. బీ సీ సెంటర్లలో ఇంకా డీసెంట్ బిజినెస్ చేస్తోంది కానీ.. ఖర్చుల ప్రకారం చూస్తే.. ఈ సినిమాది నెగిటివ్ రిజల్ట్ అనాల్సిందే. ముఖ్యంగా ఏ సెంటర్లలో కలెక్షన్స్ దారుణంగా ఉండడమే ఈ ఫెయిల్యూర్ కి రీజన్ అంటున్నారు ట్రేడ్ జనాలు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/