టికెట్ కౌంటర్:కంటెంట్ ఎక్కువే..కిక్ తక్కువ

Update: 2016-11-07 11:30 GMT
ఈ వారంలో 12 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. 8 డైరెక్ట్.. 4 డబ్బింగ్ మూవీస్ రిలీజ్ అయినా.. కౌంటర్లు మాత్రం కళకళలాడలేదు. విపరీతంగా బజ్ క్రియేట్ చేసిన సుమంత్ మూవీకి ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.

1. నరుడో.. డోనరుడా: సుమంత్ మూవీకి చాలా కాలం తర్వాత రిలీజ్ కి ముందే మంచి హైప్ వచ్చింది. అయితే.. విక్కీ డోనర్ కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ఒరిజినల్ ని యథాతథంగా తీసేందుకు ప్రయత్నించినా.. ఆ కిక్ మాత్రం ఇవ్వలేకపోయింది. ప్రోమోస్ కారణంగా ఓపెనింగ్స్ పర్లేదనిపించినా.. ఆశించిన స్థాయిలో మూవీ రిజల్ట్ కనిపించడం లేదు.

2. కాష్మోరా: రెండో వీకెండ్ లో కార్తీ మూవీ కాష్మోరా బాగానే పెర్ఫామ్ చేసింది. బీ సీ సెంటర్లలో వసూళ్లు బాగున్నాయి. మరికొన్ని రోజులు ఈ స్పీడ్ కంటిన్యూ చేస్తే సేఫ్ వెంచర్ అయిపోవడం ఖాయం. కార్తీ స్టామినాను కాష్మోరా మరోసారి ప్రూవ్ చేసింది.

3. ధర్మయోగి: గతవారమే వచ్చిన ఈ డబ్బింగ్ సినిమాకి శుక్రవారం రిలీజ్ కాకపోవడం కొంత కీడు చేసింది. ప్రమోషన్స్ వీక్ గా ఉండడంతో జనాల్లోకి వెళ్లడానికి టైమ్ పట్టింది. అయితే.. మౌత్ టాక్ బాగుండడంతో పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.

4. మనలో ఒకడు: ఆర్పీ పట్నాయక్ లీడ్ రోల్ లో నటించిన మనలో ఒకడుకు రివ్యూలు బాగానే ఉన్నా.. కనీస మాత్రం ఓపెనింగ్స్ రాబట్టడంలో ఫెయిల్ అయింది. థియేటర్లకు జనాలను రాబట్టగలిగే స్టార్ క్యాస్టింగ్ లేకపోవండ మనలో ఒకడు చిత్రానికి మైనస్ పాయింట్ గా చెప్పాలి.

5. ఏ దిల్ హై ముష్కిల్: కరణ్ జోహార్ డైరెక్షన్ లో రణబీర్ కపూర్- ఐశ్వర్యారాయ్- అనుష్క శర్మలు నటించిన ఈ చిత్రానికి.. మల్టీప్లెక్సు ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. హైద్రాబాద్ లాంటి సిటీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో టాప్2లో నిలవడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News