మిగిలిన సీజన్లతో పోలిస్తే సమ్మర్ సీజన్ పై సినిమా ఇండస్ట్రీ ఎక్కువ ఆశలే పెట్టుకుంటుంది. ఈ సీజన్ లో కుటుంబ సమేతంగా సినిమాలు చూసేవాళ్లు ఎక్కువ ఉంటారు. సినిమా బాగానే ఉందనే టాక్ వచ్చినా మంచి కలెక్షన్లు వస్తాయి. అందుకే ఈ సీజన్ కు సినిమా తేవడానికి దర్శక - నిర్మాతలు ఆరాట పడుతుంటారు. సమ్మర్ మొదలవడానికి ముందు ఉన్న పీరియడ్ ను రంగస్థలం - భరత్ అనే నేను చక్కగా ఉపయోగించుకున్నాయి.
రానున్న రెండు మూడు నెలల్లో ప్రేక్షకుల ముందు చాలానే ఇంట్రస్టింగ్ సినిమాలు రాబోతున్నాయి. ఇవన్నీ డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కినవి కావడం ఓ విశేషం. అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ఈ క్యూలో ముందుంది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దీని తరవాత అలనాటి సావిత్రి జీవితగాథతో మహానటి సినిమా వస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఒక్కో విశేషం రిలీజ్ అవుతున్న కొద్దీ సినిమాపై ఇంట్రస్ట్ విపరీతంగా పెరుగుతోంది. అర్జున్ రెడ్డితో యూత్ కు తెగ నచ్చేసిన విజయ్ దేవరకొండ ఈసారి టోటల్ ఫ్యామిలీని ఎంటర్ టెయిన్ చేసేందుకు టాక్సీవాలాగా వస్తున్నాడు. ఈ సమ్మర్ లో ఇది కూల్ హిట్ కొడుతుందని విజయ్ నమ్మకంతో ఉన్నాడు. దీనికితోడు గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి సినిమా వస్తుండటంతో ఈ మూవీకి మంచి బజ్ వస్తోంది.
యాక్షన్ ప్రియుల లిస్ట్ లో ముందుగా నాగచైతన్య మూవీ సవ్యసాచి ఉంది. ప్రముఖ తమిళ నటుడు మాధవన్ నెగిటివ్ రోల్ చేయడం.. చందు మొండేటి దర్శకత్వ ప్రతిభపై ప్రేక్షకుల్లో మంచి నమ్మకం ఉండటం.. ఇందులో యాక్షన్ సీన్స్ ఓ రేంజిలో చిత్రీకరించడం ఈ మూవీకి హైప్ తీసుకొచ్చాయి. భారీ బడ్జెట్ తో చిత్రాలు చేసే హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ సాక్ష్యం కూడా ఈ సీజన్ లోనే వస్తోంది. సాక్ష్యం ట్రైలర్ సూపర్ గా ఉండటంతో ప్రేక్షకులకు ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. మాస్ మహారాజా కూడా తనకు కలిసొచ్చిన మాస్ ఎంటర్ టెయినర్ తో ముందుకొస్తున్నాడు. నేలటిక్కెట్టు టైటిల్ తోనే మాస్ ను సగం ఆకట్టుకున్నాడు. ఇవికాక సుధీర్ బాబు ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన రొమాంటిక్ ఎంటర్ టెయినర్ సమ్మోహనం.. నితిన్ హీరోగా వస్తున్న శ్రీనివాస కళ్యాణంపైనా ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి.
ఇవన్నీ తెలుగు డైరెక్ట్ సినిమాలు కాగా కాలా డబ్బింగ్ సినిమాతో తలైవా రజనీకాంత్ కూడా సమ్మర్ రేసులోకి వస్తున్నాడు. రజనీ సినిమాలకు తమిళంతోపాటు తెలుగులోనూ మంచి ఆదరణ ఉంది. కాలాపై ఇప్పటికయితే అంత భారీ అంచనాలేం లేవు.