సంక్రాంతి మ్యాజిక్ రిపీట్ అయితేనా..

Update: 2017-08-11 04:49 GMT
పోయినేడాది సంక్రాంతికి నాలుగు క్రేజున్న సినిమాలు రిలీజయ్యాయి. అందులో మూడు మంచి లాభాలందుకున్నాయి. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ బ్లాక్ బస్టర్ అయితే.. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సూపర్ హిట్టయింది. ‘నాన్నకు ప్రేమతో’ కూడా హిట్ కేటగిరిలోకి చేరింది. ‘డిక్టేటర్’ యావరేజ్ అనిపించుకుంది. ఒకేసారి నాలుగు సినిమాలా అన్నవాళ్లంతా ఇలా మూడు సినిమాలు మంచి లాభాలందుకోవడం చూసి ఆశ్చర్యపోయారు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలూ కలెక్షన్ల వర్షం కురిపించాయి. ‘ఖైదీ నంబర్ 150’ చిరంజీవికి.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ బాలయ్యకు కెరీర్ హైయెస్ట్ గ్రాసర్లయ్యాయి. ‘శతమానం భవతి’ వీటిని మించిన బ్లాక్ బస్టర్ అయింది.

ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వీకెండ్‌ ను నమ్ముకుని ఒకే రోజు మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ మూడు సినిమాల మీదా మంచి అంచనాలే ఉన్నాయి. మేకర్స్ చాలా కాన్ఫిడెంట్‌ గా సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూడు సినిమాల్లో దేనికి నెగెటివ్ టాక్ వచ్చినా బ్యాండ్ పడిపోతుంది. అలా కాకుండా సంక్రాంతి తరహాలోనే మ్యాజిక్ రిపీటైతే ఎంత బాగుంటుందో అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఈ మూడు సినిమాల్లో దేని ప్రేక్షకులు దానికి ఉన్నారు. దేని క్రేజ్ దానికి ఉంది. ప్రోమోలు చూస్తే మూడు సినిమాలూ ఆడేలాగే కనిపించాయి. మూడు రోజుల వీకెండ్ కు తోడు.. రెండు రోజులు సెలవులు కూడా కలిసొస్తున్న నేపథ్యంలో సినిమాలకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. అన్నింటినీ ప్రేక్షకులు ఆదరిస్తారు. కలెక్షన్ల వర్షం కురిపిస్తారు. మరి ఈ మూడు హిట్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకుల్ని సంబరాల్లో ముంచెత్తుతాయేమో చూద్దదాం.
Tags:    

Similar News