ఒకరిని చూసి నేర్చుకోమనే రోజులు ఎప్పుడో పోయాయి. కాకుంటే.. పక్కనే ఉన్న కోలీవుడ్ హీరోలకుండే సామాజిక బాధ్యత.. సమాజం పట్ల వారు పడే తపన చూసినప్పుడు.. తెలుగు హీరోల్లో కూడా ఇలాంటి గుణాలు ఉంటే బాగుండేవన్న భావన అప్పుడప్పుడు కలుగుతుంటుంది. ఆ మధ్యన చెన్నై మహా నగరాన్ని వరదలు ముంచెత్తిన వేళ.. పలువురు తమిళ హీరోలు తమ స్టార్ డమ్ ను పక్కన పెట్టేసి.. రోడ్ల మీద కు వచ్చేయటం.. బాధితులకు సాయం చేయటం కోసం ఎంత గా శ్రమించారన్న విషయాన్ని ఫోటోలు.. వీడియోల్లో చూశాం.
అలాంటి పరిస్థితి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కనిపించదు. అలా లుంగీలు పైకి లాక్కొని మరీ పని చేయాలని.. చెమటలు చెందించాలని కోరుకోం కానీ.. కనీసం తాము చేసే సినిమాల సంఖ్యను పెంచాలనుకోవటం అత్యాశ కాదు కదా? సినిమా ఇండస్ట్రీ బాగు కోసం అదే పనిగా మాట్లాడే చాలామంది హీరోలు.. తాము ఏడాదికి తీసే సినిమాల సంఖ్యను పెంచటం ద్వారా ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాల్ని పెంచేందుకు సాయం చేస్తుందన్న విషయాన్ని ఎందుకు ఆలోచించరన్నది అర్థం కాదు.
తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా.. క్రేజ్ ఉన్న కథానాయకుల్ని చూస్తే.. వారు ఏడాదిలో ఒక సినిమా తీస్తే గొప్ప గా.. రెండు సినిమాలుచేస్తే అద్భుతమన్నట్లుగా మారిపోయింది. ఇలాంటివేళ.. కోలీవుడ్ స్టార్ హీరో తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొని చెప్పిన మాటల్ని చూసినప్పుడు.. ఇలా ఆలోచించే తెలుగు హీరో మనకు లేరే? అన్న వేదన కలగటం ఖాయం. ప్రముఖ తమిళ హీరో సూర్య అగరం ఫౌండేషన్ నిర్వహిస్తుంటారు. ఆయన సోదరుడు కార్తీ ఉళవన్ అనే సంస్థ ను నిర్వహిస్తున్నారు.
సూర్య నిర్వహించే అగరం ఎన్జీవో.. పేద విద్యార్థుల చదువు.. ఉపాధి అవకాశాల్ని పెంచేందుకు సాయం చేస్తే.. ఉళవన్ రైతుల సంక్షేమం కోసం పని చేస్తుంటుంది. తాజాగా అగరం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం లో పాల్గొన్న సూర్య మాట్లాడుతూ.. తమ సంస్థ విద్యార్థులకు చక్కటి విద్యను.. ఉపాధి అవకాశాల్ని పెంపొందిస్తే చాలన్నారు. ఇతరులకు సాయం చేస్తే జీవితం పరిపూర్ణమవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన.. తన సంస్థ మరింతగా పని చేసేందుకు అవసరమైన నిధుల కోసం ఎక్కువ సినిమాల్లో నటిస్తానని వ్యాఖ్యానించటం గమనార్హం.
ఎక్కువ సినిమాల్లో నటిస్తే.. ఎక్కువ డబ్బులు వస్తాయి. వాటి తో మరిన్ని మంచి పనులకు అవకాశం ఉంటుందన్న మాటను చూస్తే.. ఈ తరహాలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల బతుకుల్ని మార్చటం కోసం.. వారికి సాయంగా నిలిచేందుకు మన హీరోలు ఎందుకు ఆలోచించరన్న భావన కలగటం ఖాయం. కొద్దిమంది హీరోలు సాయం చేస్తుంటారు. కానీ.. అదంతా బయట కు రాదు. కానీ.. పెద్ద ఎత్తున చేసే ప్రయత్నం చేయటం.. అందులో భాగంగా మరిన్ని ప్రాజెక్టులు చేయాలని తపించటం లాంటివి హీరో సూర్యను చూసి స్ఫూర్తి పొందితే బాగుంటుందేమో?