అసలు ఎలాంటి అంచనాలు లేకుండా దేశంలో చరిత్ర సృష్టించిన సినిమా కేజీఎఫ్. బాహుబలి తర్వాత దేశంలో సంచలనం రేపింది కేజీఎఫ్. కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందురు నిర్మించారు. 2018 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా మాములు విజయం సాధించలేదు. విడుదలైన అన్నీ బాషలలో మంచి విజయం అందుకుంది. అయితే కేజీఎఫ్ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఆధిక ధరకు కొనుగోలు చేసి ప్రేక్షకులకు అందుబాటులో ఉంచింది. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. కేజీఎఫ్ సినిమా తెలుగు సాటిలైట్ హక్కులను ఇంతవరకు ఏ తెలుగు ఛానల్ కొనుగోలు చేయలేదట.
అయితే ప్రస్తుతం కేజీఎఫ్ సాటిలైట్ హక్కులను కొనుగోలు చేయడానికి కొన్ని టాప్ చానెల్స్ పోటీ పడుతున్నాయట. ఇక ఈ సినిమా తెలుగు సాటిలైట్ హక్కులు చర్చల దశలో ఉండగానే.. ఓ తెలుగు లోకల్ ఛానల్ కేజీఎఫ్ సినిమాను అక్రమంగా ప్రసారం చేసిందట. ఈ విషయాన్నీ కేజీఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ గౌడ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. అంతేగాక ఆ ఛానల్ స్ట్రీమింగ్ స్క్రీన్ షాట్ కూడా పోస్ట్ చేశారు. ఇలా సినిమా హక్కులు చర్చల దశలో ఉండగానే అక్రమంగా ప్రసారం చేయడం పై నిర్మాతలు మండిపడుతున్నారు. ప్రసారం చేసిన ఆ లోకల్ ఛానల్ పై లీగల్ చార్జెస్ తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం కేజీఎఫ్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండేసరికి సాటిలైట్ హక్కులు ఎవరు కొనలేదని టాక్. ఇదిలా ఉండగా ప్రస్తుతం కేజీఎఫ్ కి కొనసాగింపుగా కేజీఎఫ్2 రూపొందుతున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందే కేజీఎఫ్2 భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది..