నెలన్నర పాటు సినిమాల కుమ్ముడే

Update: 2017-09-04 03:47 GMT
సెప్టెంబర్.. అక్టోబర్ నెలలు తెలుగు సినిమాలతో ప్యాక్ అయిపోయాయి. దాదాపు అన్ని రకాల జోనర్ లలోనూ మూవీస్ వచ్చేస్తున్నాయి. కమర్షియల్ మూవీస్.. హారర్ సినిమాలు.. ఇంటెలిజెంట్ థ్రిల్లర్స్.. ఇలా ఏ రకమైన వినోదానికి కొదువ లేకుండా మూవీస్ వచ్చేస్తున్నాయి.

ఇప్పటికే నందమూరి బాలకృష్ణ పైసా వసూల్.. దిల్ రాజు సపోర్ట్ తో వెళ్లిపోమాకే చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇక సెప్టెంబర్ 8న డ్రోన్ మేకర్ గా నాగచైతన్య నటిస్తున్న యుద్ధం శరణం వచ్చేస్తోంది. ఇందులో శ్రీకాంత్ విలన్ గా నటించబోతున్నాడు. ఇదే రోజున రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ లోని అల్లరి నరేష్ మూవీ మేడ మీద అబ్బాయి కూడా రిలీజ్ అవుతోంది. దుల్కర్ సల్మాన్-సాయి పల్లవి డబ్బింగ్ మూవీ హే పిల్లగాడా.. సచిన్ జోషి వీడెవడు కూడా సెప్టెంబర్ 8నే థియేటర్లలోకి రానున్నాయి.

ఆ మరుసటి వారం అంటే.. సెప్టెంబర్ 15న కామెడీ హీరో నటించిన ఉంగరాల రాంబాబు విడుదల అవుతోంది. క్రాంతి మాధవ్ డైరెక్షన్ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నా.. సునీల్ ట్రాక్ రికార్డ్ కాసిన్ని సందేహాలు తలెత్తేలా చేస్తోంది. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన సైంటిఫిక్ థ్రిల్లర్ శ్రీవల్లి కూడా సెప్టెంబర్ 15నే విడుదల అవుతోంది. వీటితో పాటు సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన గల్ఫ్.. సందీప్ కిషన్-లావణ్య త్రిపాఠి నటించిన ప్రాజెక్ట్ జెడ్ కూడా అదే రోజున వచ్చే ఛాన్సుంది. ఓ కొత్త దర్శకుడు అండ్ టీమ్ రూపొందించిన 'ప్రేమ ఎంత మధురం ప్రియురాలు ఎంత కఠినం' అనే అమెరికా బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ కూడా అప్పుడే రానుంది.

సెప్టెంబర్ 21న ఎన్టీఆర్ మూవీ జై లవ కుశ విడుదల కానుంది. జనతా గ్యారేజ్ సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ చేస్తున్న మూవీ కావడం.. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ఆకర్షణలు. సెప్టెంబర్ 27న మహేష్ బాబు స్పైడర్ రిలీజ్ అవుతోంది. తొలిసారిగా మల్టీ లింగ్యువల్ లో మహేష్ నటించడం.. మురుగదాస్ డైరెక్షన్ కావడంతో.. సూపర్ స్టార్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ జనాలు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 29న మారుతి దర్శకత్వంలో మహానుభావుడిగా వచ్చేస్తున్నాడు శర్వానంద్. ఈ కుర్రాడికి పెద్ద సినిమాల మధ్యతో తన చిన్న సినిమా రిలీజ్ చేసి సక్సెస్ సాధించడం బాగా అలవాటయిపోయింది. ఇందులో హీరో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కారణంగా.. అతి శుభ్రత పాటించేస్తూ ఉంటాడు.

22 నెలల తర్వాత తిరిగి వస్తున్నాడు రవితేజ. అక్టోబర్ 12న రాజా ది గ్రేట్ అంటూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రాన్ని రిలీజ్ చేయనున్నాడు. ఇందులో హీరో అంధుడి పాత్ర కావడం గమమించాలి. మరోవైపు ఆక్సిజన్ అంటూ అదే రోజున గోపీచంద్ సినిమా రిలీజ్ అవుతోంది. ఆ తర్వాతి రోజునే హారర్ జోనర్ లో రాజు గారి గది2 అంటూ నాగార్జున వచ్చేస్తున్నారు. ఇందులో ఆయన కాబోయే కోడలు సమంత దెయ్యంగా నటించడం విశేషం. సీరత్ కపూర్ అందాలు ఈ చిత్రానికి మరో ఆకర్షణ కానున్నాయి.

రామ్ నటించిన ఉన్నది ఒకటే జిందగీ తో పాటు.. లండన్ బాబులు.. మంచు మనోజ్ ఒక్కడు మిగిలాడు చిత్రాలు కూడా అక్టోబర్ తొలిభాగంలో వచ్చేందుకు సిద్ధపడుతున్నా.. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంది.
Tags:    

Similar News