సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో టాలీవుడ్ జట్టు సంచలనం సృష్టించింది. వరుసగా రెండోసారి కప్పు దక్కించుకుని ట్రోఫీని గెలుచుకుంది. టోర్నీ ప్రారంభం నుంచి దూకుడుతో ఆధిక్యం ప్రదర్శించన తెలుగు వారియర్స్.. ఫైనల్ లో మరింతగా రెచ్చిపోయారు. తిరుగులేని ఆటతీరుతో సీసీఎల్ ట్రోఫీని దక్కించుకున్నారు.
డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన వారియర్స్ జట్టు.. కర్నాటకతో ఫైనల్స్ లో అడుగు పెట్టేందుకు ముందునుంచి సత్తా చాటింది. మొదట ప్లేఆఫ్స్ లో మెరుగైన ప్రదర్శన కనపరిచి సెమీ ఫైనల్స్ లో అడుగుపెట్టింది. అక్కడ భోజ్ పురి దబాంగ్స్ ను ఓడించి, ఫైనల్స్ కి ప్రవేశించింది. చివరిదైన ఫైనల్స్ మ్యాచ్ లో సుదీప్ సారధ్యం లోని పటిష్టమైన కర్నాటక బుల్డోజర్స్ తో తలపడి, డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాను నిలబెట్టుకుంది వారియర్స్.
కర్నాటక జట్టుకు ఇది ఐదో ఫైనల్ కావడం విసేషం. తొలుత బ్యాటింగ్ చేసిన కర్నాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయగా... తెలుగు వారియర్స్ జట్టు కేవలం 17.5 ఓవర్లలోనే ఒకే వికెట్ నష్టానికి 211 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. దీంతో వరుసగా 2015, 2016 సంవత్సరాలకు గానీ సీసీఎల్ ఛాంపియన్ షిప్ తెలుగు వారియర్స్ కే దక్కింది. ఫైనల్ మ్యాచ్ లో సచిన్ జోషీ(115) వీరోచిత సెంచరీ సాధించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కించుకున్నాడు.