తొలిసారి తన బేనర్ లో వేరే హీరోతో సినిమా తీశాడు కళ్యాణ్ రామ్. బడ్జెట్ కూడా బాగా ఎక్కువైంది. కాబట్టి కిక్-2 విషయంలో కచ్చితంగా టెన్షన్ ఉంటుంది. ఇక తొలిసారి ఓ సీక్వెల్ ట్రై చేస్తున్న సురేందర్ రెడ్డికి కూడా టెన్షన్ ఉండే ఉంటుంది. పైగా ఎక్కువ ఖర్చు పెట్టించేశాడన్న విమర్శ కూడా ఉంది అతడిపై. ఇక సినిమా సినిమాకు ఇమేజ్ పెంచుకుంటున్న రవితేజ.. టాలీవుడ్ సూపర్ స్టార్లకు తానేమీ తీసిపోనని ‘కిక్-2’తో చాటిచెప్పాలనుకుంటున్నాడు. మార్కెట్ పరంగా కొత్త శిఖరాల్ని అందుకోవాలని చూస్తున్నాడు. అతడికీ కొంచెం టెన్షన్ ఉంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సంగతి సరేసరి. ఇప్పటిదాకా ఓ మోస్తరు హీరోలతోనే చేసింది. ఇప్పుడు ‘కిక్-2’తో టాప్ లీగ్ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ అనే ముద్ర వేయించుకోవాలనుకుంటోంది. స్టార్స్ తో సైతం తన లక్కీ ఛార్మ్ ను కొనసాగించాలనుకుంటోంది. ఆమెకీ టెన్షనే.
ఐతే వీళ్లందరి టెన్షన్ ఓ ఎత్తు. వీళ్లకంటే కూడా ‘కిక్-2’ విషయంలో ఎక్కువ టెన్షన్ పడుతున్న వ్యక్తి ఇంకొకరున్నారు. ఆయనే.. బ్రహ్మానందం. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా తెలుగు తెరపై నెంబర్ వన్ కమెడియన్ గా కొనసాగుతున్న బ్రహ్మికి ఈ మధ్య కాలం కలిసిరావడం లేదు. ఏడాదిగా ఆయన కెరీర్ డోలాయమాన పరిస్థితిలో ఉంది. ఇంతకుముందులా ఆయన పాత్రలు పేలట్లేదు. వరుసగా ఆయన క్యారెక్టర్లు తేలిపోతున్నాయి. ఫ్లాపులు ఎదురవుతున్నాయి. బ్రహ్మి పనైపోయిందన్న ప్రచారం కొంచెం గట్టిగానే సాగుతోంది. కెరీర్ లో అత్యంత ఇబ్బందికర వాతావరణం ఎదురవుతోంది బ్రహ్మికి. ఈ పరిస్థితుల్లో ‘కిక్-2’ మీద ఆయన భారీ ఆశలే పెట్టుకున్నారు. సురేందర్ రెడ్డి సినిమాలు కిక్, రేసుగుర్రం.. బ్రహ్మి కెరీర్ లో మరపురాని సినిమాలయ్యాయి. ఇప్పుడు కిక్-2 కూడా హిట్టయి.. ఆయన పాత్ర పేలితే బ్రహ్మికి ఈ సినిమా మధుర జ్నాపకం అవుతుంది. అందుకే ఈ సినిమా విషయంలో చాలా టెన్షన్ గా ఉన్నాడు బ్రహ్మి.