మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గాడ్ ఫాదర్'. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ 'లూసీఫర్' ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేస్తున్నారు. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్స్ కంపనీ శ్రీమతి సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ఆర్.బి. చౌదరి, ఎన్. వి. ప్రసాద్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5న దసరా కానుకగా భారీ స్థాయిలో తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఆగస్టు 21న విడుదల చేసిన టీజర్ కు ప్రేక్షకుల, మెగా అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. సినిమా రిలీజ్ కి సరిగ్గా రెండు వారాలే వుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ని స్పీడప్ చేసేశారు. ఇందులో భాగంగా ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇతర ప్రధాన పాత్రల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార, యంగ్ హీరో సత్యదేవ్, సునీల్, మురళీశర్మ, సముద్రఖని, గంగవ్వ, తాన్యా రవిచంద్రన్ నటిస్తున్నారు.
అయితే చిరుకు ఇందులో హీరోయిన్ లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన స్టైల్ సాంగ్స్, మెరుపులు కష్టమేనా అని అబిమానులు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ పాల్గొనగా సాండీ నేతృత్వంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా దర్శకత్వంలో 'థార్ మార్ తక్కర్ మార్' అంటూ సాగే ఓ భారీ పార్టీ సాంగ్ ని ముంబైలోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్ లో చిత్రీకరించారు. ఫస్ట్ సింగిల్ గా ఇదే లిరికల్ వీడియోని రిలీజ్ చేస్తామంటూ సెప్టెంబర్ 13న ప్రకటించారు.
కానీ అనుకున్న ప్రకారం రిలీజ్ చేయలేకపోయారు. టెక్నికల్ సమస్యల కారణంగా రిలీజ్ ఆస్యమైన ఫస్ట్ లిరికల్ వీడియో 'థార్ మార్ తక్కర్ మార్' ని ఎట్టకేలకు అనుకున్నట్టుగానే బుధవారం సాయంత్రం 4:05 నిమిషాలకు విడుదల చేసి ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు. అనంతశ్రీరామ్ రచన చేసిన ఈ పాటని పాపులర్ సింగర్ శ్రేయాఘోషల్ ఆలపించగా తమన్ సంగీతం అందించాడు. 'డానులు వచ్చిండ్రే.. డాన్సులు దంచుండ్రే... ఫ్యాన్స్ కి పండగే చూడరే చూడరే.. బాస్ లు వచ్చిండ్రే.. బేస్ లు పెంచండ్రే.. అంటూ సాగే ఈ పాట ఫ్యాన్స్ కి నిజంగా విజువల్ ట్రీట్ గా కనిపిస్తోంది.
మెగాస్టార్, సల్మాన్ ఖాన్ ఇద్దరూ ఈ పాటలో స్వాగ్ తో అదరగొట్టేశారు.. తమన్ తనదైన స్టైల్ మ్యూజిక్ ని అందించి పాటకు మరింత వన్నె తెచ్చే ప్రయత్నం చేశాడు. మాస్ బీట్ లతో తమన్ ఈ పాటకు అందించిన సంగీతం ఫ్యాన్స్ ని అలరించడం ఖాయం.
ఇక చిరు డాన్స్ మాస్టర్ తరహాలో కనిపిస్తూ మూవ్ మెంట్స్ ఇస్తుంటే సల్మాన్ ఖాన్ .. చిరు ఫేమస్ స్టెప్ అయిన వీణ స్టెప్ ని ప్రయత్నించడం.. చిరు వారించడం.. మధ్యలో నవ్వులు పూయిస్తోంది. ఇద్దురు స్టార్స్ సెన్సాఫ్ హ్యూమర్ వున్న వాళ్లే కావడంతో సాంగ్ మధ్యలో వీరిద్దరు చేసే చిలిపి అల్లరి కూడా ఈ పాటకు ప్రధాన హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది. సాండీ డ్యాన్స్ కంపోజ్ చేయగా ప్రభుదేవా ఈ పాటని డైరెక్ట్ చేయడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View