మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ''గాడ్ ఫాదర్''. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాని దసరా సందర్భంగా రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.
ఇప్పటికే 'గాడ్ ఫాదర్' సినిమా నుంచి క్యారక్టర్ పోస్టర్స్ మరియు టీజర్ వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా 'తార్ మార్ తక్కర్ మార్' అనే ఫస్ట్ సింగిల్ ని తెలుగు హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. అయితే ప్రోమో మాదిరిగానే ఫుల్ సాంగ్ ని కూడా మేకర్స్ చెప్పిన సమయానికి విడుదల చేయలేదు.
అది కూడా యూట్యూబ్ లో లిరికల్ వీడియో కాకుండా.. స్పోటి ఫై మ్యూజిక్ యాప్ లో లాంచ్ చేశారు. దీనిపై ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారని మెగా ఫ్యాన్స్ ప్రొడక్షన్ హౌసెస్ ని ట్రోల్ చేస్తున్నారు. అయితే సాంకేతిక కారణాలతోనే విడుదల ఆలస్యం అయిందని.. రిలీజ్ డేట్ టైం త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఇక సాంగ్ విషయానికొస్తే.. 'బాసులు వచ్చిండ్రే.. బేసులు పెంచున్డ్రే.. బాక్సులు బద్దల్రే.. యాష్ కరే యాష్ కరే..' అంటూ సాగిన ఈ డ్యాన్స్ నంబర్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. బిగ్గెస్ట్ మెగాస్టార్స్ చిరంజీవి మరియు సల్మాన్ ఖాన్ కలిసి వేసిన స్టెప్పులు విజువల్ గా ఎలా ఉంటాయనే ఆసక్తిని కలిగించింది.
ఎస్ఎస్ థమన్ ఈ పాటకు మంచి డ్యాన్స్ బీట్ ని కంపోజ్ చేయగా.. శ్రేయా ఘోషల్ హుషారుగా పాడింది. 'కొండలన్నీ పిండి చేసే కండలు ఉన్నోడే.. గండాలన్నీ దండం పెట్టే గుండె దమ్మున్నోడే.. టాలీవుడ్ ని బాలీవుడ్ ని తారుమారేంగే..' అంటూ ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా గీత రచయిత అనంత శ్రీరామ్ కాస్త భిన్నమైన లిరిక్స్ అందించాడు.
'తార్ మార్ తక్కర్ మార్' పాటకు శాండీ కొరియోగ్రఫీ చేయగా.. ప్రభుదేవా డైరెక్షన్ చేయడం విశేషం. దీనికి నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించగా.. సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. తొలిసారిగా బాలీవుడ్ - టాలీవుడ్ మెగాస్టార్స్ స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ పాటకు థియేటర్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన 'లూసిఫర్' చిత్రానికి అధికారిక రీమేక్ గా ''గాడ్ ఫాదర్'' సినిమా తెరకెక్కింది. ఒరిజినల్ లో 'తార్ మార్ తక్కర్ మార్' లాంటి పార్టీ సాంగ్ కు చోటు లేదు. మరి తెలుగులో చిరు ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేశారా? లేదా దీన్ని ఎండ్ టైటిల్స్ లో వేస్తారా? అనేది చూడాలి.
ఈ సినిమాలో నయనతార - సత్యదేవ్ కీలక పాత్రలు పోషించగా.. సునీల్ - సముద్ర ఖని - తాన్యా రవిచంద్రన్ - బ్రహ్మాజీ - మురళీ శర్మ - ఇంద్రజిత్ సుకుమారన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
కొణిదెల ప్రొడక్షన్స్ సురేఖ సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ఆర్‌బి చౌదరి మరియు ఎన్‌వి ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. తెలుగుతో పాటుగా హిందీలోనూ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.