కరోనా క్రైసిస్ భయాల నడుమ జనాల్ని థియేటర్లకు రప్పించడం అంత సులువేమీ కాదు. సెకండ్ వేవ్ అనంతరం ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయినా ఇటీవల రిలీజవుతున్న వరుస చిత్రాలకు పాజిటివ్ సమీక్షలు రావడం క్రిటిక్స్ రేటింగ్ లు బావుండడంతో జనం అంతో ఇంతో థియేటర్లకు వస్తున్నారని అంగీకరించాలి.
అమ్మ జయలలిత జీవితకథతో తెరకెక్కిన తలైవి వినాయక చవితి కానుకగా విడుదలైంది. అయితే డే వన్ రిపోర్ట్ ఎలా ఉంది? అన్నది ఆరా తీస్తే.. కొంత నిరాశ తప్పలేదు. తలైవి చిత్రం అన్ని చోట్లా మంచి సమీక్షలకు తెరతీసింది. కానీ కలెక్షన్లు చెప్పుకోడానికి ఏమంత లేదని టాక్ వినిపిస్తోంది. భారతదేశంలో ఈ సినిమా 1.28 కోట్ల నికర వసూళ్లను తెచ్చిందని సమాచారం. విడుదలైన అన్ని భాషల నుండి వసూళ్లు ఇవీ అన్నది నిరాశపరుస్తోంది. ఈ చిత్రం హిందీలోనూ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అక్కడ నేటివిటీ సమస్య కారణంగా సరిగా ఆడలేదని తమిళ ట్రేడ్ విశ్లేషిస్తోంది.
అయితే సండేతో వారాంతం ముగుస్తుంది. మంచి టాక్ ఉంది.. కానీ వికెండ్ రిపోర్ట్ ఎలా ఉండనుందో వేచి చూడాలి. మునుముందు ఈ చిత్రం ఎంత ఎక్కువ వసూలు చేస్తుందో చూడాలి. తలైవి పాత్రలో కంగన.. ఎంజిఆర్ గా అరవింద్ స్వామి అద్భుతంగా నటించారని టాక్ వచ్చింది. జీవీ ప్రకాష్ సంగీతం.. విజయ్ దర్శకత్వ పనితనం అస్సెట్ అయ్యాయన్న పాజిటివ్ బజ్ ఉంది.