ఆమె బెదిరింపులకు భయపడేది లేదు

Update: 2021-09-05 14:30 GMT
బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ తో పెట్టుకునేందుకు ఎవరైనా భయపడుతారు. ఆమె నోట్లో నోరు పెడితే లేని పోని చిక్కులు.. చికాకులు. ఎందుకు వచ్చిన గొడవలే అనుకుని చాలా మంది ఆమె విమర్శలకు కూడా కనీసం సమాధానం చెప్పేందుకు ఆసక్తి చూపించరు. బాలీవుడ్ లో స్టార్స్ చాలా మందితో ఈమె కు విభేదాలు ఉన్నాయి. ఎన్ని విభేదాలు ఉన్నా కూడా ఆమె పై మాత్రం బాహాటంగా ఎవరు విమర్శలు చేసేందుకు సాహసం చేయరు. అలాంటి ఫైర్‌ బ్రాండ్‌ కు వ్యతిరేకంగా ఇప్పుడు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అయిన పీవీఆర్ మరియు ఐనాక్స్ లు వెళ్లబోతున్నాయి. ఆమె నటించిన తలైవి సినిమాను తమ స్క్రీన్స్‌ లో స్క్రీనింగ్‌ కు నో చెబుతున్నారు.

కంగనా నటించిన తలైవి సినిమాను వినాయక చవితి సందర్బంగా ఈ వారంలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన సినిమా అవ్వడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అయితే థియేటర్లు సరిగా లేని ఈ సమయంలో.. కరోనా భయం ఇంకా ఉన్న ఈ సమయంలో సినిమాను విడుదల చేయడం పట్ల కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో తలైవి విడుదలకు ఇది సరైన సమయం కాదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా ఆలస్యం అవ్వడం వల్ల సినిమాను ఎలాగైన విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో విడుదలకు సిద్దం అయ్యారు.

ఈ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లతో ముందస్తుగానే హిందీ వర్షన్ ను రెండు వారాల తర్వాత ఓటీటీ లో తమిళ వర్షన్ ను నాలుగు వారాల తర్వాత ఓటీటీ లో విడుద లచేసేలా ఒప్పందం చేసుకున్నారు. తలైవి ఒప్పందంకు పీవీఆర్ మరియు ఐనాక్స్ లు ఒప్పుకోవడం లేదు. రెండు వారాల్లోనే ఓటీటీ కి వెళ్లడం అనేది ఏమాత్రం కరెక్ట్‌ కాదని.. రెండు వారాల్లో ఓటీటీ లో వస్తుంది కనుక థియేటర్లలో చూసేందుకు జనాలు రారు అనేది వారి వాదన. ఈ సమయంలో సినిమాలు థియేటర్ల వద్దకు రావడం గగనంగా మారింది. అలాంటిది మేము విడుదల చేస్తుంటే ఇలా అడ్డు చెప్పడం ఏంటీ అంటూ కంగనా విమర్శలు చేయడం మొదలు పెట్టింది. ఈ సమయంలోనే ఆమె విమర్శలకు కాస్త వెనక్కు తగ్గిన ఆ రెండు మల్టీ ప్లెక్స్ యాజమాన్యాలు తమిళ వర్షన్ నాలుగు వారాల తర్వాత ఓటీటీ కనుక తాము తమిళం స్క్రీనింగ్‌ కు ఓకే అన్నట్లుగా ప్రకటించారు. మరి ఈ వివాదం ఎక్కడకు దారి తీస్తుందో చూడాలి.
Tags:    

Similar News