'తలైవి' ని ఆ డేట్ కే ఫిక్స్ చేశారు

Update: 2021-01-19 05:26 GMT
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవి ప్రస్తుతం విడుదలకు సిద్దం అవుతుంది. కంగనా రనౌత్‌ టైటిల్ రోల్‌ లో నటించింని ఈ సినిమా విడుదల విషయమై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాను ఫిబ్రవరి 24న విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా అదే తేదీని ఫిక్స్‌ చేసినట్లుగా యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. షూటింగ్‌ పూర్తి చేసేందుకు చాలా సమయం తీసుకున్న యూనిట్‌ సభ్యులు విడుదల విషయంలో హడావుడిగా ఉన్నారు.

కరోనా కారనంగా గత ఏడాదిలో విడుదల అవ్వాల్సిన సినిమాను వాయిదా వేశారు. ఇప్పుడు సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి అవ్వడంతో మరింత ఆలస్యం చేయవద్దనే ఉద్దేశ్యంతో వచ్చే నెలలో విడుదలకు సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన తుది దశ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను మొదలు పెట్టేందుకు యూనిట్‌ సభ్యులు సిద్దం అవుతున్నారు. మొత్తం అయిదు భాషల్లో ఈ సినిమా విడుదల కోసం డబ్బింగ్ వర్క్‌ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అరవింద్ స్వామి కీలక పాత్రలో నటించిన ఈ సినిమాపై అన్ని భాషల్లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.
Tags:    

Similar News