తమిళ హీరోలు సింప్లిసిటీ విషయంలో నిజంగా హీరోలు అనిపించుకుంటూ ఉంటారు. ఇతర భాషల హీరోలతో పోల్చితే తమిళ హీరోలు చాలా సింపుల్ గా కనిపిస్తారు. సాదారణ సమయంలో హంగు ఆర్బాటాలు ఎక్కువగా ఉండవు అంటూ మొదటి నుండి టాక్ ఉంది. అది తాజాగా మరోసారి నిరూపితం అయ్యింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ ఒక అభిమాని చెప్పు దారిలో ఉండగా దానికి చేతితో పట్టుకుని అతడికి అందజేయడం జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాఓల వైరల్ అవుతోంది. అదే ఇతర భాషల హీరోలు ఎవరైనా అసలు ఆ చెప్పును పట్టించుకుంటారా అంటూ విజయ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
విజయ్ ఇటీవల మృతి చెందిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి అంత్యక్రియల్లో పాల్గొన్న విషయం తెల్సిందే. భారీగా అభిమానులు వస్తారని తెలిసినా కూడా కరోనాను లక్ష్య పెట్టకుండా బాలుగారిపై అభిమానంతో విజయ్ అంత్యక్రియలు జరిగే వద్దకు వెళ్లి చరణ్ ను ఓదార్చి పక్కనే ఉండి అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే చాలా మంది అభిమానులు మరియు మీడియా వారు ఆయన వైపు తీసుకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో తోపులాటలో ఒకరి చెప్పు ఊడిపోయింది. దాంతో విజయ్ కిందకు వంగి మరీ ఆ చెప్పును తీసుకుని వారికి ఇవ్వడం జరిగింది. ఆ వీడియో బిట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.

Respect To The Core Thalaivaa