`సర్కార్ వారి పాట` చిత్రం నుండి కళావతి సాంగ్ ఎంతగా పాపులరైందో తెలిసిందే. ఈ పాటకు మహేష్ గారాల పట్టీ సితార అద్భుత నర్తనలు జోడించడంతో మరింతగా పాపులారిటీ పెరిగింది. ఇప్పుడు స్టార్ మ్యూజిక్ కంపోజర్ ఎస్.ఎస్ థమన్ `సర్కారు వారి పాట` ఆల్బమ్ లోని కళావతి పాటకు నాగిని నృత్యం చేస్తూ సంచలనం సృష్టించాడు. ఈ పాట నిజానికి రిలీజ్ కాగానే ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ గా మారింది. ఇదంతా థమన్ మ్యూజిక్ పనితనం. ఇప్పుడు థమన్ కళావతి పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. అతను ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.
మహేష్ బాబు కుమార్తె సితారతో సహా సెలబ్రిటీలు సామాన్యులు కూడా కళావతి పాటలో మహేష్ హుక్ స్టెప్ ను అనుకరించే వీడియోలను పంచుకుంటున్నారు. ఈ జాబితాలోకి థమన్ కొత్తగా చేరాడు. మునుముందు ఇంకా చాలా మంది బకెట్ ఛాలెంజ్ తరహాలో ఈ కళావతి స్టెప్స్ ఛాలెంజ్ లో పాల్గొంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇకపోతే ఎస్.ఎస్.థమన్ అందించిన అల వైకుంఠపురములో అతడి కెరీర్ బెస్ట్ ఆల్బమ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మళ్లీ అలాంటి సీన్ ని థమన్ రిపీట్ చేస్తాడా లేదా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి. అతడిలో ఆ రేంజు పూనకాలు చూడాలని సంగీత ప్రియులు ఆశపడుతున్నారు. `సర్కారు వారి పాట` మే 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ఆడియో విజువల్ గా మరింత రక్తి కట్టిస్తుందనే అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
మహేష్ ఫ్యాన్స్ లో టెన్షన్..
పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `సర్కారు వారి పాట` సమ్మర్ కానుకగా మే 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో చిత్రయూనిట్ ప్రచారం ప్రారంభించింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లతో హీటెక్కించిన మహేష్ అండ్ కో సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. అటు మ్యూజికల్ గానూ సినిమాను హైలైట్ చేస్తున్నారు. కళావతి తర్వాత మరిన్ని పాటలు శ్రోతల్ని విశేషంగా అలరించనున్నాయి. మహేష్ ఇప్పటివరకూ కనిపించని సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు.
అలాగే మహేష్ ని పరశురామ్ తనదైన శైలిలో కంపర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాడని ప్రూవ్ అవుతోంది. సినిమాలో కమర్శియల్ అంశాలు పుష్కలంగా జొప్పించినట్లు కళావతి పాత్రను..మహేష్ క్యారెక్టరైజేషన్ ని డిజైన్ చేశారని అర్థమవుతోంది. మహేష్ పాత్రని `గీత గోవిందం`లో విజయ్ దేవరకొండ విజయ్ అనే పాత్రకు పూర్తి కాంట్రాస్ట్ గా భావించవచ్చు. `గీతగోవిందం`లో అందమైన మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని స్థిరపడాలన్నిది విజయ్ పాత్ర స్వభావం. కానీ సర్కారు వారి పాటలో మహేష్ రోల్ అందుకు భిన్నంగా కనిపిస్తోంది.. విజయ్ పాత్ర స్ఫూర్తితోనే మహేష్ పాత్రని కొత్తగా డిజైన్ చేసినట్లు కనిపిస్తుందని అభిమానులు గెస్ చేస్తున్నారు. దీనిపై పుల్ క్లారిటీ రావాలంటే ట్రైలర్ రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
ప్రస్తుతం `సర్కారి వారి పాట` పోస్ట్ ప్రొడక్షన్ ల్లో ఉంది. మహేష్ డబ్బింగ్ పనులు పూర్తిచేసి కొత్త సినిమా షూట్ లో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ ని దుబాయ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మహేష్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.

#Siggggguthooooooooo !!!
Nannnnuu nennnneeaaaaaaa