ఒక వైపు అల వైకుంఠపురంలో సినిమాకి సంబందించిన సౌండ్ వర్క్స్.. మరో వైపున డిస్కోరాజా కి కూడా ట్యూన్స్ ఇవ్వాలి.. ఇంత హెట్టిక్ షెడ్యూల్ ఉంటే ఎవరికైనా టెన్షన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కానీ థమన్ రూటే వేరు టెన్షన్ ని ఎంజాయ్ చేస్తూ కూల్ కూల్ గా పని చేసుకుంటున్నాడు.. ఇది కాస్త వింతగా అనిపించినా... వాస్తవం ఇదే.. కూల్ గా ఉండటం తన సక్సెస్ సీక్రెట్ అంటున్న ఈ మ్యూజిక్ మెషిన్ తో తుపాకీ రీడర్స్ కోసం ఒక స్పెషల్ చిట్ చాట్
* గత ఏడాది చాలా బాగా ముగుసినట్లుంది?
(కొంత షాక్ ఎక్స్ ప్రెషన్ ఆ తరువాత నవ్వులు) అవును కదా లాస్ట్ ఇయర్ మొన్నే గా అయ్యింది - అవునండి చాలా బిజీ గా వరుస బ్లాక్ బస్టర్స్ తో చాలా హ్యాపీ గా ముగిసింది. ఇయర్ ఎండింగ్ ఐతే ప్రతి ఫ్రైడే నా సినిమాలు ఉన్నాయి. ఆ బిజీ బిజీ ఇప్పటికి కొనసాగుతూనే ఉంది.
* మీరు ఎప్పుడు బిజీ గానే ఉంటారు గా - అందుకే గా చాలా స్పీడ్ గా ఇన్ని సినిమాలు చేశారు?
నాకు డెసిషన్ త్వరగా తీసుకోవడం అలవాటు - ఒకసారి ఒక డెసిషన్ తీసుకున్నాక దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూపోవడం కూడా అలవాటు అందుకే ఈ లాస్ట్ మినిట్ టెన్సన్స్ - కానీ అవుట్ ఫుట్ వచ్చాక అది హిట్ ఐతే మాత్రం ఈ కష్టం నాకే కాదు ఎవరికి గుర్తు ఉండదు. ఇక మీరు అన్నట్లుగా నేను ఎప్పుడు బిజీ గానే ఉండటానికి ఇష్టపడతాను - నేనే కాదు కాళీ గా ఉండటానికి ఇష్టపడని వారు బిజీ గా ఉండాలనే కోరుకుంటారు - ఈ జాగ్రత్తే నన్ను ఇన్ని సినెమాలకి మ్యూజిక్ అందించేలా చేసింది.
* అల వైకుంఠపురంలో సినిమా చూసారా?
రి రికార్డింగ్ అలానే ఇతర మ్యూజిక్ వర్క్స్ కోసం నేను ప్రతి సీన్ చూడాల్సిందే కానీ అలా వర్క్ చేసేటప్పుడు సినిమా ఎలా ఉంటుందో జడ్జ్ చేయలేము - ఐ మీన్ ఎంజాయ్ చేయలేము - కానీ త్రివిక్రమ్ సర్ - బన్నీ గారు సినిమాలు మాత్రం వర్క్ చేస్తున్నప్పుడే నేను ఎంజాయ్ చేసేలా ఉంటాయి. ఈ సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ కి రికార్డింగ్ చేయడానికి నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. పని ఆపేసి నవ్వుతూనే ఉన్నా అంత బాగున్నాయి కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో. ఓవరాల్ గా సినిమా కూడా చాలా బాగా వచ్చింది.
* స్టార్ హీరోల సినిమాకి సూపర్ హిట్ సాంగ్స్ ఇస్తున్నారు - మరి మీడియం రేంజ్ హీరోలకి కేవలం హిట్ సాంగ్స్ మాత్రమే ఇస్తున్నారు - ఎందుకు ఈ డిఫరెన్స్?
హిట్ ప్లాప్ మన చేతిలో లేని విషయాలు అది పూర్తి గా ఆడియన్స్ ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఫై ఆదారపడి ఉంటుంది. ఇక్కడ నేను చేసే ట్యూన్స్ నాకు డైరెక్టర్ చెప్పిన కథ ని దృష్టిలో పెట్టుకొని చేసినవే తప్ప స్టార్ హీరో కి ఒక మాదిరి సాంగ్స్ - మీడియం రేంజ్ హీరోలకి ఒక మాదిరి ట్యూన్స్ ఇవ్వడం నేను ఇంత వరకు చేయలేదు. ఇప్పుడు నా కెరీర్ కి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా అలవైకుంఠపురం లో సామజవరాగమనా సాంగ్ అసలు ఆల్బమ్ లోనే పెట్టకూడదు అనుకున్నాం, కానీ ఆడియన్స్ ఆ పాట ని పెద్ద హిట్ చేసారు.
* సాంగ్స్ బావుంటే సినిమాలు హిట్ అవుతాయి అనే కామెంట్ మీ అభిప్రాయం?
కంటెంట్ బావుంటే సినిమాలు హిట్ అవుతాయి అలా వచ్చిన హిట్ కి కలెక్షన్స్ పెంచి సూపర్ హిట్ వైపు నడిపించడానికి ఆ మూవీ లో ఉండే సాంగ్స్ ఉపయోగపడతాయి అన్నది నేను నమ్ముతాను. ఇప్పుడు అల వైకుంఠపురంలో పాటలు హిట్ అయ్యాయి - కానీ ఈ సినిమాకి ఓపెనింగ్స్ మాత్రం బన్నీ గారిని - త్రివిక్రమ్ సర్ ని ఆ తరువాత నేను ఇచ్చిన పాటలు వల్ల వస్తాయి. సాంగ్స్ బావుండి ప్లాప్ అయిన సినిమాలు మనం చాలానే చూస్తున్నాము గా
* బాయ్స్ తరువాత మళ్ళీ యాక్షన్ వైపు రాలేదు ఎందుకు?
బాయ్స్ సినిమా నా డైరీ లో ఒక స్వీట్ మెమరీ - అది అలానే ఉండాలి - నా టాలెంట్ మ్యూజిక్ బాగా ఇవ్వడం - ఇందులోనే నేను కంటిన్యూ ఐతే బాగుటుంది గా - ఎందుకు ఆ సైడ్ ట్రాక్స్..!
*ఇప్పుడున్న మీ రూట్ చాల బావుంది - ఈ మ్యూజిక్ రూట్ లోనే మీరు మరింత ముందుకు వెళ్లి ఆ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారి రేంజ్ కి వెళ్ళాలి అని మా తుపాకీ టీం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.
* అల్ ది బెస్ట్
ఇళయరాజా గారి రేంజ్ కి వెళ్ళాలి అని అంటున్నారు - కష్టమే కానీ నేను ట్రై చేస్తాను - థాంక్యూ ఫర్ ది వార్మ్ విషెస్ అండి - నా మ్యూజిక్ ఇష్టపడే వారంతా నా సినిమాలు కేవలం థియేటర్ లోనే చూడండి - కిల్ పైరసీ