హైప్ కోసం తమన్ ను దించారు

Update: 2018-06-13 10:05 GMT
వరుసగా భారీ సినిమాలను నిర్మించి హిట్స్ కొట్టేసిన యూవీ క్రియేషన్స్ అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాల మీద కూడా ద్రుష్టి పెడుతోంది. ఆ బ్యానర్ టచ్ చేసింది అంటే సినిమా మీదా హైప్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం హ్యాపి వెడ్డింగ్ అనే సినిమా మీద కూడా హైప్ క్రియేట్ చెయ్యాలని యూవీ ప్రొడక్షన్ తెగ ట్రై చేస్తోంది. ఎందుకంటే ఈ సినిమా హిట్టు యువ హీరో సుమంత్ అశ్విన్ కు చాలా ముఖ్యం.

సీనియర్ నిర్మాత ఎమ్.ఎస్. రాజు గారు కొడుకు అయినా కూడా పెద్దగా విజయాలు అందుకోవడం లేదు. చేసిన సినిమాలు ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యాయి. ఇక ఇప్పుడు హిట్టు కొట్టాలని మంచి యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రానున్నాడు. ఈ హ్యాపీ వెడ్డింగ్ సినిమా లో మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమాకు థమన్ ను కూడా యాడ్ చేశారు. శక్తీ కాంత్ కార్తిక్ ఆల్ రెడీ మ్యూజిక్ అందిస్తున్నప్పటికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసమని థమన్ ని రంగంలోకి దించారు.

సినిమా రిలీజ్ తరువాత జనాలను ఎంతవరకు ఆకట్టుకుంటుందో గాని హైప్ మాత్రం గట్టిగా క్రియేట్ చేయాలని ఫిక్స్ అయినట్టున్నారు. ఇటీవల కాలంలో థమన్ మ్యూజిక్ కి చాలా పాజిటివ్ టాక్ వస్తోంది. చాలా మార్పులు చేసి కొత్త ట్యూన్ ఇస్తున్నాడు అనే ఒక బ్రాండ్ సెట్ చేసుకోవడంతో ఈ సినిమాకు హెల్ప్ అవ్వవచ్చు. ఇక లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది.


Tags:    

Similar News