సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ ఆస్పత్రిలో చేరారని.. ఆయనకు కోవిడ్ టెస్టులు నిర్వహించారని కథనాలు రాగానే అభిమానుల్లో ఒకటే ఆందోళన. ఇంతకీ ఏమైంది? ఆయన ఆరోగ్యంగానే ఉన్నారా? అన్నాథే షూటింగ్ ని పూర్తి చేసి బయటపడతారా? నెలాఖరున రాజకీయ పార్టీని ప్రకటించడం ఎలా? .. ఇలా పరిపరి విధాలా అభిమానులు ఆందోళన చెందారు.
అయితే ఇంతలోనే కోవిడ్ 19 గండం రజనీకి లేదని తేలగానే ఊపిరి పీల్చుకున్నారు. టెస్టుల్లో నెగెటివ్ వచ్చింది. ఎలాంటి సమస్యా లేదు. చాలా సాధారణ ఆరోగ్య సమస్యలు తప్ప భయపడాల్సిందేమీ లేదని డాక్టర్లు ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో అన్నాథే చిత్రీకరణలో ఉండగానే ఇంత మెలోడ్రామా రన్ అవ్వడంతో అభిమానులు పూర్తిగా ఖంగు తిన్నారు. ప్రస్తుతం రజనీ ఆరోగ్యంగా బాగానే ఉంది. ఆయన చెన్నయ్ కి వెళుతున్నారు. అయితే తిరిగి అన్నాథే షూటింగులో జాయినయ్యేదెపుడు? అన్నదే కన్ఫ్యూజన్ గా మారింది.
అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినా డిసెంబర్ 31 న తన రాజకీయ పార్టీని ప్రకటించే విషయంలో ఒత్తిడి అతని తలపై ఇంకా అలానే కొనసాగుతూనే ఉంది. తలైవా అభిమానులు ఏం చేస్తారా అన్న అనిశ్చితి మధ్య వేచి చూస్తున్నారు. ప్రస్తుత సెన్సిటివ్ హెల్త్ ఇష్యూస్ ని బట్టి పార్టీని పెడతారా లేదా? అన్న డైలమా అలానే ఉంది. రజనీకాంత్ `అన్నాథే` షూటింగ్ ను తిరిగి ప్రారంభించటానికి కూడా కొంత విరామం తీసుకోవచ్చు. ఎందుకంటే షూటింగ్ సమయంలో ఈ కోవిడ్ ముప్పు ఉంది. ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది? అన్నది కాస్త ఓపిగ్గా వేచి చూడాల్సిందే.