సోషల్ మీడియా విస్తరించిన తర్వాత స్టార్ హీరోలు మాగ్జిమమ్ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ అంటూ.. ఏదో ఒక మాధ్యమం ద్వారా వారికి అందుబాటులో వస్తున్నారు. ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. పర్సనల్ లైఫ్ తోపాటు కెరీర్ అప్డేట్స్ కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.
అయితే.. ఈ విషయంలో ప్రభాస్ గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ వచ్చింది. ప్రభాస్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ రెబల్ స్టార్ కు ట్విట్టర్ అకౌంట్ కూడా లేకపోవడం గమనించాల్సిన విషయం. ఓ ఫేస్ బుక్ అకౌంట్ మాత్రమే ఉంది. ఎప్పుడైనా ఏదైనా చెప్పాలనిపించినప్పుడు మాత్రమే దానికి పనిచెబుతాడు ప్రభాస్.
ఈ విషయమై ప్రభాస్ ను డైరెక్ట్ చేయబోతున్న నాగ్ అశ్విన్ ఇంకా లోతైన వివరాలు వెల్లడించారు. అసలు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గురించి ప్రభాస్ పట్టించుకోడట. అంతేకాదు.. బాక్సాఫీస్ వద్ద తన చిత్రం కలెక్ట్ చేసింది, ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? అనేవి కూడా ఆలోచించడట. అసలు తానో సెలబ్రిటీ అన్న ఫీలింగ్ లేకుండా.. చాలా సింపుల్ గా ఉంటాడని చెప్పాడు అశ్విన్.
అసలు ప్రభాస్ ఫోన్లో సోషల్ మీడియా యాప్స్ కూడా ఉండేది అనుమానమే అంటున్నాడీ దర్శకుడు. నిజానికి.. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన ప్రభాస్.. వీటిని లైట్ తీసుకోవడం నిజంగానే స్పెషల్ కదా. ఇవన్నీ చూసినప్పుడు ప్రభాస్ తో ఫ్యాన్స్ టచ్ లో ఉండే ఏకైక కనెక్షన్ ఫేస్ బుక్ అకౌంట్ అని అర్థమవుతోంది. మరి, రెబల్ స్టార్ ను ఏమన్నా అడగాలంటే ఛలో టూ ఫేస్ బుక్.