దక్షిణాది సినీ ప్రేక్షకులకు సీనియర్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ సుమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హ్యాండ్సమ్ హీరోగా గుర్తింపు పొందిన సుమన్.. అప్పట్లో రజనీకాంత్ - కమల్ హాసన్ - చిరంజీవి వంటి హీరోలకు పోటీ ఇచ్చాడు. హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ తో కూడా మెప్పించిన సుమన్.. ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతూ వస్తున్నారు. అయితే అప్పట్లో సుమన్ స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో అనుకోని విధంగా జైలుపాలయ్యారు. ఈ వివాదంలో తెర వెనుక ఓ స్టార్ హీరో హస్తం ఉందని.. సుమన్ తనకు పోటీ వస్తాడన్న స్వార్థంతో ఆ హీరోయే ఇదంతా చేయించాడని ఇండస్ట్రీలో గాసిప్స్ వినిపించాయి. అయితే సుమన్ తో సన్నిహితంగా ఉండే సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీనిపై వివరణ ఇచ్చారు.
సి.కళ్యాణ్ మాట్లాడుతూ 'సుమన్ క్రూరుడు కాదు చెడ్డవాడు కాదు. చాలా మంచివాడు. అలా జరగడం ఆయన తలరాత' అని అన్నారు. అతను జైలుకి కావాలని ఓ అగ్ర హీరో పంపించారని వచ్చిన రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని అన్నారు. సుమన్ తన స్నేహితుల వద్ద ఒక గొడవలో తెలియకుండా నోటి దురుసు కారణంగానే విషయం కోర్టు వరకు వెళ్లిందని కళ్యాణ్ చెప్పుకొచ్చారు. సుమన్ ఎంత అందగాడో అతని క్యారెక్టర్ కూడా అంతే స్వచ్ఛమైదని నిర్మాత అన్నారు. ఇకపోతే సుమన్ జైలు నుంచి బయటకి వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూలలో దీనిపై స్పందిస్తూ నన్ను ఆ కేసులో ఇరికించడం వెనుక ఏ హీరో హ్యాండ్ లేదని.. అవన్నీ రూమర్స్ అని కొట్టి పారేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మరోసారి ఇదే అంశంపై మాట్లాడారు. తనను ఈ కేసులలో ఇరికించిన వ్యక్తి ఒకప్పటి నా స్నేహితుడు అని.. అతనికీ టాలీవుడ్ కూ ఏ సంబంధం లేదని.. అయితే ఈ వివాదంలోకి సినీ ప్రముఖుల పేర్లను మీడియా వాళ్ళు కావాలనే ప్రస్తావించారని చెప్పుకొచ్చారు. జైలుకు వెళ్తానన్న విషయం తనకు ముందే తెలిసిందని.. ఈ కేసులో తన ఫ్రెండ్ భాను చందర్ ను కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకుని అతన్ని కాపాడానని.. ఆ సమయంలో తనను కలవొద్దని ఫోన్ కూడా చేయొద్దని భానుచందర్ తో చెప్పానని తెలిపారు. గూండా యాక్ట్ పెట్టడంతో అంతకు ముందు ఇలాంటి కేసులు రిఫరెన్స్ లేకపోవటంతో క్లీన్ చీట్ రావాడానికి చాలా సమయం పట్టిందని.. చివరకు ఆ ఆరోపణలు అబద్ధాలేనని తేలిపోయిందని సుమన్ చెప్పుకొచ్చారు.