ఒక వయసు వచ్చాక చేసే చిన్న పొరపాటు నిర్ణయం కూడా ప్రాణాలు పోయేందుకు అవకాశం ఉంటుంది. గతానికి భిన్నంగా గడిచిన కొంతకాలంగా మరణాలు అనుకోని రీతిలో విరుచుకుపడుతున్నాయి. అనారోగ్యాన్ని అసెస్ చేసే విషయంలో జరిగే పొరపాట్లకు ప్రాణం కోల్పోయేంత ఖరీదైన మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. తాజాగా ప్రముఖనటి మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్ మరణం చాలామందికి షాకింగ్ కు గురి చేసింది.
బాలీవుడ్ లో తీవ్ర చర్చకు దారి తీసిన ఆయన మరణం గురించి సంగీత దర్శకుడు సులేమాన్ మర్చంట్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒక మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంలో కౌశల్ మరణానికి దారి తీసిన కారణాల్ని అతడు వెల్లడించాడు. ‘అతడికి 30-32 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అనుకుంటా.. ఒకసారి గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండేవాడు. కానీ.. విధి రాత వేరేలా ఉంది. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచే తను చాలా నీరసంగా ఉన్నాడు. టాబ్లెట్ కూడా వేసుకున్నాడు. మధ్య రాత్రి గుండె నొప్పి మొదలైంది. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో పరిస్థితి విషమించింది’’ అని చెప్పాడు.
ఒకసారి గుండెనొప్పి వచ్చిన హిస్టరీ ఉన్నప్పుడు.. గుండెకు సంబంధించిన సమస్యగా ఎదురైనంతనే వాయువేగంతో ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ.. ఆ విషయంలో కౌశల్ చేసిన పొరపాటు అతడి ప్రాణాలు పోవటానికి కారణమైందని చెప్పక తప్పదు. తనకు గుండె నొప్పి విపరీతంగా వస్తోందని భార్య మందిరాకు చెప్పటం.. ఆ వెంటనే ఆమె ఆశిష్ చౌదరికి ఫోన్ చేశారు.
‘‘వారిద్దరు కలిసి కౌశల్ ను కారులో కూర్చోబెట్టి లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే.. దారి మధ్యలోనే స్పృహ కోల్పోయారని.. సమయానికి ఆసుపత్రికి చేరుతామని అనుకున్నా.. ఆలస్యమైందని చెప్పారు.
కారులో కూర్చున్న పది నిమిషాలకే అతడి పల్స్ ఆగిపోయినట్లుగా వారు గుర్తించారు’’ అని వెల్లడించారు. సులేమాన్ మాటల్ని విన్నప్పుడు.. ఆరోగ్యం సరిగా లేనప్పుడు.. గుండెలో తేడా ఉన్నంతనే ఆసుపత్రికి వెళ్లి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో? అన్న మాట వినిపిస్తోంది.