RRR తర్వాత అలియా భట్ తో మళ్లీ SS రాజమౌళి పని చేయాలనుకోవడం లేదా? అంటే అతడి సమాధానం ఇలా ఉంది. రాజమౌళి RRRలో అలియా భట్ చిన్నదే అయినా కీలకమైన పాత్రను పోషించింది.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి తాను ఆలియాతో మళ్లీ పని చేయాలనుకుంటున్నారా లేదా అనేది వెల్లడించారు.
రామ్ చరణ్- జూనియర్ ఎన్టీఆర్- అలియా భట్ - అజయ్ దేవగన్ నటించిన RRR బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. రామ్ చరణ్- జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో కనిపించగా.. ఆలియా .. అజయ్ ఈ చిత్రంలో అతిధి పాత్రలు పోషించారు. సినిమా విడుదలైన తర్వాత ఆలియా పాత్ర నిడివితో సంతోషంగా లేదని ఆమె చిత్ర బృందంతో కలత చెందిందని నివేదికలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని స్పష్టం చేస్తూ ఆమె ఒక ప్రకటనను తాజాగా విడుదల చేసింది. ఇప్పుడు రాజమౌళి ఆ పుకార్లపై ఓపెనయ్యారు. అతను మళ్లీ అలియాతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి రూమర్ల గురించి ఓపెనయ్యారు. "మీ సినిమా గురించి ఎటువంటి రూమర్స్ రాకపోతే మీరు నిజంగా ప్రభావం చూపకుండా చింతించవలసి ఉంటుంది. ఒక్కసారి సినిమా ప్రభావం చూపడం మొదలుపెడితే అప్పుడే రూమర్లు రాసేవాళ్లు వచ్చి దాని గురించి మాట్లాడుకోవడం మొదలుపెడతారు. వాస్తవానికి ఇది పెద్ద బిజినెస్ అని రాజమౌళి నవ్వేస్తూ అన్నారు.
''నేను నిజంగా అలియాను ఇష్టపడతాను. ఆమె నటనా నైపుణ్యానికి నేను తనను చాలా ఆరాధిస్తాను. నేను తనతో మళ్లీ పనిచేయడానికి నిజంగా ఎదురుచూస్తున్నాను. ఆమె నా గురించి అదే చెబుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నటిగా దర్శకుడిగా మేం ఇద్దరం నిజంగా క్లిక్ అయ్యాం. అయితే సినిమాలో తనకు పెద్ద పాత్ర లేదు. ఆమె కోసం నా వద్ద పెద్ద పాత్ర లేదు. అయితే కథ అలా ఉంది. మేం అనుకున్నట్టు లేదు సరే.. పెద్ద పాత్ర చేస్తాం కానీ తిరిగి తగ్గించాం. లేదు... ఇది చిన్న పాత్ర అని మాకు ఎప్పుడూ తెలుసు.
కానీ రెండు శక్తుల(చరణ్ - తారక్)ను ఒకచోట చేర్చడంలో ఇది చాలా చాలా ముఖ్యమైన పాత్ర. అది నేను ఆమెకు చెప్పాను .. ఆమె దానిని మనస్పూర్తిగా అంగీకరించింది. అది మాకు ఎప్పుడూ తెలుసు. మేము కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఆమెతో మళ్లీ పని చేయడానికి నిజంగా ఎదురుచూస్తున్నాను'' అని రాజమౌళి అన్నారు. అన్నట్టు రాజమౌళి తనవద్ద రెండు లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టులు ఉన్నాయని అన్నారు. అందులో ఒకటి ఆలియా కోసమా? అన్నది మాత్రం అతడు ఇంకా రివీల్ చేయలేదు. చేస్తాడేమో చూడాలి.
ఏదేమైనా ఆలియాను మళ్లీ ఎస్.ఎస్ రాజమౌళి చిత్రంలో చూడటం ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం.. రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ షూటింగ్ లో ఆలియా భట్ బిజీగా ఉంది. ఈ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లి తర్వాత ఆలియా-రణబీర్ ప్రణాళిక గురించి మరిన్ని వివరాలు కూడా వెల్లడి కావాల్సి ఉంటుంది.