సామ్ ని కాపాడుతున్న అంగ‌ర‌క్ష‌కులు?!

Update: 2023-01-14 03:37 GMT
ఎవ‌రు ఎన్ని చెప్పినా ఎవ‌రు ఏమ‌నుకున్నా స‌మంత ఇప్పుడు ఒంట‌రి. నాగ‌చైత‌న్య నుంచి బ్రేక‌ప్ అయ్యాక త‌న లైఫ్ అమాంతం మారిపోయింది. స్టార్ గా ఇప్ప‌టికే జేజేలు అందుకుంటున్న స‌మంత‌ను విధి వెంటాడింది. మ‌యోసైటిస్ అనే ప్రాణాంత‌క వ్యాధి త‌న‌ను వెంటాడుతోంది.

కానీ మొక్క‌వోని ధీక్ష‌తో మొండి ప‌ట్టుద‌ల‌తో త‌న మునుప‌టి క‌మిట్ మెంట్ల‌ను పూర్తి చేస్తోంది. ఇప్పుడు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంత‌లం చిత్రంతో అభిమానుల‌ను మైమ‌రిపించేందుకు వస్తుంది. ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. అందం ఆక‌ర్ష‌ణ ప‌రంగాను స‌మంత‌లో ఏమంత మార్పు క‌నిపించ‌లేదు.

ఇక‌పోతే ఇప్పుడు ఒంట‌రిత‌నంలోను త‌న వెంట అంగ‌ర‌క్ష‌కులుగా త‌న‌ని 24 గం.లు కంటికి రెప్ప‌లా కాచుకుని కూచుంటున్న ఆ ఇద్ద‌రు ఫ్రెండ్స్ గురించి తెలుసుకుని తీరాలి. ఇందులో ఒక‌రు హాష్ .. మ‌రొక‌రు షాషా. ఈ రెండు పెట్ డాగ్స్ స‌మంత‌ను ఇంట్లో క్ష‌ణం కూడా విడిచిపెట్టి ఉండ‌వు. త‌న‌కు బెస్ట్ గా కంపెనీ ఇస్తున్నాయి. స‌మంత అలిసిపోయి లేదా ఇంకేదైనా క‌ల‌త‌తో అలా బెడ్ పై వాలిపోగానే అవి రెండూ త‌న‌ని విడిచిపెట్టి ఎటూ వెళ్ల‌డం లేదు.

డోంట్ వర్రీ మమ్మీ.. నేను నీ వెనకేసుకున్నాను అంటూ భ‌రోసానిస్తోంది హాష్‌. ఈ ఫోటోకి స‌మంత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. స‌మంత‌కు షాషా అండ్ హాష్ అంటే ప్రాణం. ఈ కుక్క‌పిల్ల‌లే నాగ‌చైత‌న్య‌- స‌మంత ల‌వ్ లైఫ్ గురించి హింట్ ఇచ్చాయి. ఇప్పుడు అవి పెద్ద‌వ‌య్యాయి. తాజా ఫోటోగ్రాఫ్ కి #క్రోనికల్స్ ఆఫ్ బీయింగ్ క్యూట్.. హాష్ అండ్ షాషా అనే రెండు ట్యాగులు వైర‌ల్ అవుతున్నాయి. సమంత న‌టించిన శాకుంత‌లం విడుద‌ల కావాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News