మార్చి నాటికి మ‌ళ్లీ యూఎస్ లో సంద‌డి షురూ

Update: 2022-01-29 01:30 GMT
సినిమా ఇండ‌స్ట్రీ ప్ర‌ధానంగా ఆధార‌ప‌డింది థియేట్రిక‌ల్ బిజినెస్ పైనే అనున్న‌ది ప్ర‌తీ ఒక్కిరికీ తెలిసిందే. ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ వ‌ల్ల ప్రాజెక్ట్ లు సేఫ్ జోన్ లోకి వెళ్ల‌గ‌ల‌వే కానీ నిర్మాత‌ల‌కు మాత్రం కాసుల వ‌ర్షాన్ని కురిపించ‌లేవ‌న్న‌ది ప్ర‌తీ ట్రేడ్ పండితుడికి తెలుసు. థియేట్రిక‌ల్ బిజినెస్ మీదే సినిమా ఇండ‌స్ట్రీ ఆధార‌ప‌డుతోంది. దాన్ని చాలా వ‌ర‌కు కరోనా ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. ఉత్త‌రాదితో పోలిస్తే ద‌క్షిణాది ప్రేక్ష‌కులే కోవిడ్ కి వెర‌వ‌కుండా సెకండ్ వేవ్ లో థియేట‌ర్ల‌కు వ‌చ్చి త‌మ స‌పోర్ట్ ని అందించారు.

దీని వ‌ల్ల ఫిల్మ్ ఇండ‌స్ట్రీ కొంత వ‌ర‌కు కోలుకుంద‌ని చెప్పాలి. అంతే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌న సినిమాలు థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతుండ‌టంతో బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. కోవిడ్ కార‌ణంగా అది జ‌ర‌గ‌డం లేదు. ఇక‌గ‌త కొన్ని నెల‌లుగా మ‌న ప్రేక్ష‌కుల కార‌ణంగా తెలుగు సినిమా ఇప్పుడిప్ప‌తుడే కోలుకుంటోంది. కానీ బాలీవుడ్ మాత్రం ఇప్ప‌టికే భ‌యం భ‌యంగానే అడుగులు వేస్తోంది. కొన్ని భారీ చిత్రాలు చాలా వ‌ర‌కు థియేట్రిక‌ల్ రిలీజ్ కి వెళ్ల‌కుండా ఓటీటీ బాట ప‌ట్టేశాయి.

కానీ మ‌న వాళ్లు మాత్రం మేజ‌ర్ భాగం చిత్రాల‌ని థియేట్రిక‌ల్ రిలీజ్ కే మొగ్గు చూపారు. కొన్ని కొన్ని చిత్రాలు మాత్ర‌మే ఓటీటీ బాట ప‌ట్టాయి. గ‌త రెండేళ్లుగా బాలీవుడ్ ఇండ‌స్ట్రీ స్ట్ర‌గుల్ ప‌డుతుంటే టాలీవుడ్ తో పాటు త‌మిళ చిత్రాలు మాత్రం థియేట‌ర్ బాట ప‌ట్టడం విశేషం. సెకండ్ వేవ్ ముగిసే స‌మ‌యానికి తెలుగు చిత్రాలు మంచి ఫ‌లితాల‌ని రాబ‌ట్టి ఇత‌ర ఇండ‌స్ట్రీల‌ని షాక్ కు గురిచేశాయి.

ప్ర‌స్తుతం థ‌ర్డ్ వేవ్ మొద‌లైంది. అయితే దీని కార‌ణంగా కొన్ని భారీ చిత్రాల రిలీజ్ లు ఆగిపోయాయి. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఈసారి భారీ చిత్రాల‌కు బ్రేక్ ప‌డింది. అయితే ప‌లువురు శాస్త్ర వేత్త‌లు థ‌ర్డ్ వేవ్ త్వ‌ర‌లోనే అంటే ఫిబ్ర‌వ‌రి ఎండ్ క‌ల్లా ముగుస్తుంద‌ని మ‌ళ్లీ ఎప్ప‌టిలాగే సాధార‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయ‌ని చెబుతున్న నేప‌థ్యంలో మార్చి నుంచి మ‌ళ్లీ టాలీవుడ్ చిత్రాల హంగామా ప్రారంభం కాబోతోంది.

యూఎస్ లోనూ ఒమిక్రాన్ కేసులు, క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టం, కొత్త కొత్త వ్యాక్సిన్ లు అందుబాటులోకి రావ‌డంతో అక్క‌డ కూడా ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. దీంతో మ‌ళ్లీ సినిమాల‌కు మంచి రోజులు రాబోతున్నాయని ఇక వ‌రుస‌గా తెలుగు చిత్రాలు విడుద‌ల కావ‌డం ఖాయ‌మ‌ని సంకేతాలు అందుతున్నాయి. ఇక ప‌క్క రాష్ట్ర‌మైన త‌మిళ‌నాడులోనూ నైట్ క‌ర్ఫ్యూలు ఎత్తేస్తుండ‌టం శుభ ప‌రిణామంగా చెబుతున్నారు.

ఇక ప‌రిస్థితులు మారుతున్న నేప‌థ్యంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ `ఖిలాడీ` రిలీజ్ తో తెలుగు సినిమాల  హంగ‌మా మ‌ళ్లీ మొద‌లు కాబోతోంది. ఆ త‌రువాత ప‌వ‌ర్ స్టార్ `భీమ్లా నాయక్‌`, ఆర్ ఆర్ ఆర్‌, రాధేశ్యామ్ బ్య‌క్ టు బ్యాక్ విడుద‌ల కాబోతున్నాయి. ఆర్ ఆర్ ఆర్‌, రాధేశ్యామ్ రిలీజ్ స‌మ్మ‌ర్ కు మారితే ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌లు ఖ‌లాడీ, భీమ్లా నాయ‌క్ హ‌ల్ చ‌ల్ చేయ‌డం ఖాయం అని చెబుతున్నారు. 
Tags:    

Similar News