మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కార్తికేయ - లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ''చావు కబురు చల్లగా''. కొత్త దర్శకుడు పెగళ్ళపాటి కౌశిక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో వైజాగ్ లో గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరోహీరోయిన్లతో పాటు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.
అల్లు అరవింద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ''మీకు చావు కబురు చల్లగా అని ఒక కథ చెబుతాను అన్నాడు దర్శకుడు. చావు కబురు చల్లగా.. అసలు ఇదీ ఒక టైటిలేనా?.. ఎవరైనా చావు కబురు చల్లగా చెబుతారా.. కానీ దర్శకుడు ఈ సినిమాలో ఆ టైటిల్ కు న్యాయం చేశాడు. కథలో దాయాల్సిన విషయం ఏంలేదు. భర్త చనిపోయి హీరోయిన్ ఏడుస్తుంటే కార్తికేయ వెళ్లి ఆమెను గోకుతాడు. 'ఆయన ఎలాగూ లేడు కదా.. మీరంటే నాకు ఇష్టం.. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను' అని అడుగుతాడు. ఇలాంటి విచిత్రమైన కథతో స్టార్ట్ అయి.. అనేక మలుపులు తిప్పుతూ చావు కబురు చల్లగా సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు కౌశిక్. కథ చివరకు వచ్చేసరికి హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే బాగుండు అని ప్రేక్షకులకు అనిపించేలా చాలా చక్కగా దర్శకుడు ఈ సినిమాని తీసాడు. ఒక కొత్త దర్శకుడు ఇంత బాగా తీస్తాడని మీరు ఎక్సపెక్ట్ చేయరు'' అని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా కార్తికేయను ఉద్దేస్తూ మాట్లాడుతూ 'నీకు మంచి ఫాలోయింగ్ ఉందయ్యా నీ పేరు చెప్పగానే అరుస్తున్నారు' అని నవ్వుతూ అన్నారు. 'లావణ్య త్రిపాఠి నార్త్ అమ్మాయి అయ్యుండి తెలుగు బాగా మాట్లాడుతోంది.. ఇక్కడే ఓ తెలుగు అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది' అని అల్లు అరవింద్ చమత్కరించారు.